Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీదేవితో పోటీపడగల ఏకైక నటిని నేనే... కంగనా బోల్డ్ స్టేట్‌మెంట్

భారతీయ చలన చిత్ర చరిత్రలో ఎవరినైనా ధిక్కరించి మాట్లాడగల బోల్డ్ అండ్ బ్యూటిపుల్ హీరోయిన్ ఎవరంటే కంగనా రనౌత్ పేరునే చెప్పాలి. హృతిక్ రోషన్ వ్యవహారాన్ని నలుగురిలో కడిగి పారేసినా, బాలీవుడ్ హేమాహేమీలను కత్తుల్లాంటి మాటలతో భయపెట్టినా ఆమెకే చెల్లుతుందని

Advertiesment
శ్రీదేవితో పోటీపడగల ఏకైక నటిని నేనే... కంగనా బోల్డ్ స్టేట్‌మెంట్
హైదరాబాద్ , శుక్రవారం, 23 జూన్ 2017 (02:25 IST)
భారతీయ చలన చిత్ర చరిత్రలో ఎవరినైనా ధిక్కరించి మాట్లాడగల బోల్డ్ అండ్ బ్యూటిపుల్ హీరోయిన్ ఎవరంటే కంగనా రనౌత్ పేరునే  చెప్పాలి.  హృతిక్ రోషన్  వ్యవహారాన్ని నలుగురిలో కడిగి పారేసినా, బాలీవుడ్ హేమాహేమీలను కత్తుల్లాంటి మాటలతో భయపెట్టినా ఆమెకే చెల్లుతుందని చెప్పాలి. హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన మొదట్లో తన విషయంలో అతిగా, అసభ్యంగా వ్యవహరించిన, వాడుకోవాలిని చూసిన ఏ ఒక్కరిని ఆమె తదుపరి దశలో వదిలిపెట్టలేదు. ఇప్పుడామె దృష్టి శ్రీదేవిపై పడింది. చెడ్డగా కాదు. మంచిగానే ఆమె తర్వాత నేనే అని ఆత్మవిశ్వాసం ప్రదర్శించుకుంది.
 
బాలీవుడ్‌లో మోస్ట్ సీనియర్ నటి శ్రీదేవితో పోల్చుకోవడం ద్వారా కంగనా ఒక విధంగా సంచలనమే సృష్టించింది.  లాలిత్యంలో, సాఫ్ట్ యాక్టింగ్ స్కిల్స్‌ ప్రదర్శించడంలో శ్రీదేవితో పోటీపడేవారు బాలీవుడ్‌లోనే కాదు భారతీయ చిత్రపరిశ్రమలోనే ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. కాని ఒక్క విషయంలో మాత్రం శ్రీదేవి తర్వాతి  స్థానం తనదే అని కంగనా బోల్ట్ స్టేట్మెంట్ ఇచ్చేసింది. 
 
నటిగా దాదాపుగా 50 ఏళ్ల కెరీర్‌ ఉన్న శ్రీదేవితో పదేళ్ల కెరీర్‌ మాత్రమే ఉన్న కంగనాకి పోలిక ఏంటి స్వయంగా కంగనానే ఈ పోలిక పెట్టారు. ప్రస్తుతం ఈ హాట్‌ బ్యూటీ ‘సిమ్రాన్‌’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడే శ్రీదేవి టాపిక్‌ తీసుకొచ్చారు కంగనా. 
 
‘‘ప్రస్తుతం నేను చేస్తున్న ‘సిమ్రాన్‌’ కామెడీ మూవీ. శ్రీదేవిగారి తర్వాత కామెడీ టచ్‌ ఉన్న సినిమాలో నటించిన ఏకైక హీరోయిన్‌ నేనే అని నా నమ్మకం. ‘తను వెడ్స్‌ మను రిటర్న్స్‌’లో కామెడీ చేశా. ఇప్పుడు ‘సిమ్రాన్‌’లో. హీరోయిన్లకు కామెడీ చేసే స్కోప్‌ దక్కదు. లక్కీగా నాకు దొరికింది’’ అన్నారామె. 
 
ఇదలా ఉంచతే.. వచ్చే ఏడాది కంగనా దర్శకురాలిగా మారనున్నారు. ఆ సినిమా పేరు ‘తేజు’. ఇది కూడా కామెడీ మూవీయే అని కంగనా అన్నారు. ఇందులో కంగనా 80 ఏళ్ల వృద్ధురాలిగా నటించనుండటం మరీ విశేషం.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ లుక్కేంట్రా...? కొడితే అయిపోతావ్... బాలయ్య ఫైర్(వీడియో)