Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేను రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదు: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్

సూపర్ స్టార్ రజనీకాంత్ ఏప్రిల్ 2న త‌న అభిమాన సంఘాల అధ్య‌క్షుల‌ను, కార్య‌క‌ర్త‌ల‌తో ఓ స‌మావేశం ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించుకోవ‌డంతో త‌మిళ‌నాడులో కొత్త రాజ‌కీయ పార్టీ అవ‌త‌రించ‌బోతోందా అన్న అనుమానాలు త‌

Advertiesment
politics
, శనివారం, 1 ఏప్రియల్ 2017 (11:38 IST)
సూపర్ స్టార్ రజనీకాంత్ ఏప్రిల్ 2న త‌న అభిమాన సంఘాల అధ్య‌క్షుల‌ను, కార్య‌క‌ర్త‌ల‌తో ఓ స‌మావేశం ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించుకోవ‌డంతో త‌మిళ‌నాడులో కొత్త రాజ‌కీయ పార్టీ అవ‌త‌రించ‌బోతోందా అన్న అనుమానాలు త‌లెత్తుతున్నాయి. అయితే ఆ స‌మావేశంలో ర‌జ‌నీకాంత్ ఏ అంశంపై మాట్లాడుతారో అన్న ఉత్కంఠ స‌ర్వ‌త్రా నెలకొంది. ఈ నేపథ్యంలో దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాలపై మరోసారి క్లారిటీ ఇచ్చారు.
 
తాను రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తేలేదని రజనీకాంత్ స్పష్టం చేశారు. అంతేగాకుండా ఏప్రిల్ రెండో తేదీన ఏర్పాటు చేయాలనుకున్న సమావేశాన్ని కూడా వాయిదా వేసుకున్నారు. ఏప్రిల్ 11న నుంచి 16 మధ్యలో ఎప్పుడైనా అభిమానులను కలుసుకుంటానని.. ముందు చెప్పినట్లు ఏప్రిల్ 2న వాళ్లని కలవలేకపోతున్నానని చెప్పాడు. తనతో ఫోటోలు తీసుకోవాలని చాన్నాళ్లుగా అభిమానులు సరదా పడుతున్నారు. 
 
అందుకే ఈ సమావేశం తప్ప అంతకుమించి ఎటువంటి రాజకీయ ఆలోచన లేదని చెప్పేశారు. అందరూ ఊహిస్తున్నట్లుగా ఎటువంటి సంచలన ప్రకటన ఉండబోదని తేల్చిచెప్పారు. దీంతో సూపర్‌స్టార్‌ రాజకీయ అరంగేట్రంపై వస్తున్న వదంతులకు ఫుల్‌స్టాప్ పడింది. ఇకపోతే.. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ని ఆయన ఇంట్లో మలేషియా ప్రధాన మంత్రి మహ్మద్ నజీబ్ బిన్ తున్ అబ్ధుల్ రజాక్ కలిశారు. చెన్నై పర్యటనకు వచ్చిన రజాక్‌ శుక్రవారం పోయెస్‌గార్డెన్‌లోని రజనీ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా రజనీతో రజాక్‌ సెల్ఫీ తీసుకుని ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రభాస్ కొత్త సినిమా హీరోయిన్ ఎవరో తెలుసా? అఖిల్‌కూ ఆమే హీరోయిన్?