మహేష్ కోసం బాలీవుడ్ నుంచి వచ్చేసిన బ్యూటీ స్టార్... ఎందుకు?
ప్రిన్స్ మహేష్ బాబు స్పైడర్ చిత్రం తర్వాత తదుపరి చిత్రం భరత్ అను నేను కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ నగర శివార్లలో జరుగుతోంది. ప్రస్తుతం మహేష్ బాబు స్పైడర్ షూటింగ్ చివరి సన్నివేశాల్లో పాల్గొంటున్నాడు. అది పూర్తి కాగ
ప్రిన్స్ మహేష్ బాబు స్పైడర్ చిత్రం తర్వాత తదుపరి చిత్రం భరత్ అను నేను కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ నగర శివార్లలో జరుగుతోంది. ప్రస్తుతం మహేష్ బాబు స్పైడర్ షూటింగ్ చివరి సన్నివేశాల్లో పాల్గొంటున్నాడు. అది పూర్తి కాగానే నేరుగా ఇక్కడికి వచ్చేస్తాడు.
ఇకపోతే భరత్ అను నేను చిత్రం కోసం హైదరాబాద్ నగర శివార్లలో అసెంబ్లీ సెట్ ను నిర్మించారు. ఇక్కడ ఇతర తారాగణంతో చేయాల్సిన షూటింగ్ లాగించేస్తున్నారు. మరోవైపు మహేష్ సరసన నటించేందుకు బాలీవుడ్ నుంచి ఎంఎస్ ధోనీ చిత్రంతో పేరు తెచ్చుకున్న కైరా అద్వానీని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
ఈమె హైదరాబాద్ వచ్చేసిందట. ఏకంగా మహేష్ బాబు సరసన తనకు అవకాశం రావడంపై ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తోందట. శ్రీమంతుడు చిత్రంతో మహేష్ హీరోగా కొరటాల శివ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో భరత్ అను నేను చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.