హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి నందనీ కశ్యప్‌ను గౌహతి పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆమెను కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించినట్టు ట్రాఫిక్ విభాగం డీసీపీ జయంత సారధి వెల్లడించారు.
తన కారుతో ఓ స్టూడెంట్‌ను ఢీ కొట్టి, అక్కడి నుంచి పారిపోయారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు నటిపై పోలీసులు ఇటీవల కేసు నమోదు చేశారు. చికిత్స పొందుతూ విద్యార్థి మంగళవారం రాత్రి మరణించాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిని కారు ఈ నెల 25వ తేదీన తెల్లవారుజామున 3 గంటలకు దఖింగావ్‌లో విద్యార్ధి సమియుల్ సమియుల్ హక్ను ఢీ కొట్టింది. ఆ సమయంలో కారును నందినే డ్రైవ్ చేసింది. ప్రమాదంలో సమియులు తీవ్రగాయాలయ్యాయి. అదే సమయంలో అక్కడ పనిచేస్తున్న కొందరు నటి కారును ఆపేందుకు ప్రయత్నించినా ఆమె ఆపలేదు.
చివరకు కపిలిపారాలోని ఓ అపార్టుమెంట్ వద్ద కారును గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నందిని కారును సీజ్ చేశారు. ఆమెను విచారించగా తన ప్రమేయం లేదని పోలీసులకు చెప్పినట్టు సమాచారం.