Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Advertiesment
Gopichand 33 movie look

దేవీ

, గురువారం, 12 జూన్ 2025 (17:47 IST)
Gopichand 33 movie look
గోపీచంద్ తన 33వ చిత్రం లో నటిస్తున్నారు. ఘాజి ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.  పవన్ కుమార్ సమర్పణలో నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ హిస్టారికల్ ఎపిక్ షూటింగ్ జరుగుతోంది.
 
గోపీచంద్ పుట్టినరోజును పురస్కరించుకుని, మేకర్స్ అద్భుతమైన  పోస్టర్, గ్లింప్స్‌ను విడుదల చేశారు. గోపీచంద్ లుక్, ఒక యోధుడిగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. పొడవాటి జుట్టు, యుద్ధగాయాలు, నుదిటిపై వీర తిలకంతో కనిపించిన ఇంటెన్స్ లుక్ ఫ్యాన్స్‌ను సర్ ప్రైజ్ చేసింది. చేతిలో ఖడ్గంతో యుద్ధరంగంలో కనిపించిన ఈ పోస్టర్ శక్తి, శౌర్యాన్ని ప్రజెంట్ చేస్తోంది.
 
మంచుతో కప్పబడిన అద్భుతమైన పర్వత శ్రేణుల నడుమ గ్లింప్స్ ప్రారంభమవుతుంది. ఓ యోధుడు తన టెంట్ నుంచి బయటకు వస్తాడు. తాను ప్రేమగా పెంచిన గుర్రంతో మమేకమయ్యే విజువల్ లో తన తలను గుర్రం తలపై ఆనిస్తూ, మౌనంగా ఓ వాగ్దానాన్ని చేస్తాడు. దీనికి బ్యాక్గ్రౌండ్‌లో “ధీర ధీర” సంగీతం మ్యాజికల్ అనుభూతిని కలిగిస్తుంది. ఈ విజువల్స్ మనసును తాకుతూనే పవర్‌ఫుల్‌గా, పీస్ మెడిటేటివ్ ఫీల్‌ను ఇస్తున్నాయి.
 
IB 71 (ఆకాశంలో), ఘాజి (నీటిలో), అంతరిక్షం (అంతరిక్షంలో) వంటి విభిన్న కథనాల చిత్రాలతో తన ప్రత్యేక కథనశైలి, సాంకేతిక నైపుణ్యంతో గుర్తింపు పొందిన దర్శకుడు సంకల్ప్ రెడ్డి, ఇప్పుడు మరో డిఫరెంట్ జానర్ లోకి అడుగుపెట్టారు.
 
సంకల్ప్ రెడ్డి ఈ సినిమాలో భారతదేశ చరిత్రలో మరిచిపోయిన ఒక కీలక ఘట్టాన్ని అద్భుతంగా మలిచారు. 7వ శతాబ్దం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా, ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని ఒక చారిత్రక ఘటనను ఆవిష్కరిస్తూ, మరిచిపోయిన అధ్యాయానికి మళ్లీ జీవం పోస్తోంది.
 
ఈ ఏప్రిల్‌లో కాశ్మీర్ అందమైన లొకేషన్లలో తొలి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయ్యింది. ఆ అద్భుత దృశ్యాలు బిగ్ స్క్రీన్‌పై గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వనున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో భారీ స్థాయిలో రూపొందించిన సెట్లో నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభమైంది.
 
ఈ చిత్రానికి సంబంధించి ఇతర నటీనటులు , సాంకేతిక బృందానికి సంబంధించిన వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?