చిక్కుల్లో పడిన 'వంగవీటి'.... రామ్ గోపాల్ వర్మకు హైకోర్టు నోటీసులు
టాలీవుడ్, బాలీవుడ్‌లో సంచలనాత్మక దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఒకరకంగా చెప్పాలంటే "శివ" సినిమా తర్వాత తెలుగు ఇండస్ట్రీలో విలనీజానికి కొత్త భాష్యం చెప్పిన దర్శకుడిగా మంచి గు
టాలీవుడ్, బాలీవుడ్‌లో సంచలనాత్మక దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఒకరకంగా చెప్పాలంటే "శివ" సినిమా తర్వాత తెలుగు ఇండస్ట్రీలో విలనీజానికి కొత్త భాష్యం చెప్పిన దర్శకుడిగా మంచి గుర్తింపు పొందారు. ఓ వైపు మాఫియా తరహా చిత్రాలు తీస్తూనే మరోవైపు కామెడీ చిత్రాలు, దెయ్యం చిత్రాలు తీశారు. గతకొంతకాలంగా రాంగోపాల్ వర్మ తీస్తున్న సినిమాలు పెద్దగా విజయాన్ని అందుకోలేక పోతున్నాయి. ఆ మద్య తీసిన 'కిల్లింగ్ వీరప్పన్' మంచి విజయాన్ని అందుకుంది.
ప్రస్తుతం 80వ దశకంలో కమ్మ - కాపుల మధ్య జరిగిన వివాదాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయంతెలిసిందే. రెండు కులాల గొడవ ఇప్పటికిఇంకా చల్లారలేదు ఈ నేపథ్యంలో 'వంగవీటి' చిత్రం విడుదలపై ఇప్పటికే ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. తాజాగా రామ్ గోపాల్ వర్మకి హైకోర్ట్ నోటీసులు జారీచేసింది.
విజయవాడ రౌడీయిజం, రాజకీయల నైపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంపై మొదటి నుంచి అనేక వివాదాలు వస్తూనే ఉన్నాయి. వర్మ సున్నితమైన అంశాలను కదిపి మళ్ళీ గొడవలకు ప్రేరేపిస్తున్నాడని, రెండు ముఖ్యమైన సామాజిక వర్గాల్లో దేన్నీ తక్కువగా చూపిన అల్లర్లు జరగడం ఖాయమని ఈ చిత్రంపై నిలిపివేయాలని కొంత మంది కోరుతున్నారు.
అంతేకాదు కాగా ఈ చిత్రంపై హైకోర్టు కెక్కాడు వంగవీటి మోహనరంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ. దాంతో దర్శకులు వర్మకు నోటీసులు హైకోర్టు జారీ చేసింది. అంతేకాదు ఒక దశలో వర్మకు బెదిరింపులు కూడా వచ్చాయి. అయినా వేటికీ బెదరని వర్మ సినిమాని పూర్తి చేసి విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు. మరిప్పుడు డిసెంబర్ 2న వాదనకు రానున్న ఈ కేసుపై ఆయన ఎలా స్పందిస్తాడో చూడాలి.