Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మెగా మల్టీస్టారర్ బడ్జెట్ ఎంతో తెలుసా..!

మల్టీస్టారర్లు ఎనౌన్స్ చేయడం కాదు. దానికి ఎంత బడ్జెట్ అవుతుందనే లెక్క కూడా అవసరం. ఇలాంటి లెక్కలు చుక్కలు తాకడం వల్లనే కమలహాసన్, రజినీకాంత్‌తో మళ్ళీ మల్టీస్టారర్ చేసే ఆలోచన ఎవరూ చేయలేదు.

మెగా మల్టీస్టారర్ బడ్జెట్ ఎంతో తెలుసా..!
, శనివారం, 11 ఫిబ్రవరి 2017 (14:30 IST)
మల్టీస్టారర్లు ఎనౌన్స్ చేయడం కాదు. దానికి ఎంత బడ్జెట్ అవుతుందనే లెక్క కూడా అవసరం. ఇలాంటి లెక్కలు చుక్కలు తాకడం వల్లనే కమలహాసన్, రజినీకాంత్‌తో మళ్ళీ మల్టీస్టారర్ చేసే ఆలోచన ఎవరూ చేయలేదు. ఈ మధ్య కమలహాసన్ కూడా ఇదే విషయాన్ని బయటపెట్టాడు. తామిద్దర్నీ భరించేంత సత్తా ఉన్న నిర్మాత లేడని ఓపెన్‌గానే చెప్పేశాడు. ఇక టాలీవుడ్‌కు వస్తే అలాంటి కాంబినేషన్ మళ్ళీ మెగాహీరోలదే. చిరంజీవి-పవన్ కలిసి సినిమా చేస్తే బాగా ఉంటుంది. కానీ వాళ్ళిద్దర్నీ భరించేంత డబ్బు పెట్టే నిర్మాత ఎవరున్నారు.
 
ఎట్టకేలకు నిర్మాత అయితే దొరికేశాడు. మెగా మల్టీస్టార్ తీయబోతున్నానని సుబ్బరామి రెడ్డి ప్రకటించారు. ఈ ప్రాజెక్టును అశ్వినీదత్ సహనిర్మాతగా వ్యవహరిస్తాడు. అంతాబాగానే ఉంది. కానీ తాజా సమాచారం ప్రకారం పవన్, చిరంజీవి, త్రివిక్రమ్‌కు ఇచ్చేందుకే వంద కోట్ల రూపాయల బడ్జెట్ అవుతోందట. త్రివిక్రమ్‌కు ఇచ్చేందుకే వంద కోట్ల రూపాయల బడ్జెట్ అవుతోందట. త్రివిక్రమ్‌కు పాతిక కోట్లు ఇస్తారట. మిగతా రూ.75 కోట్ల రూపాయల్ని పవన్ - చిరంజీవి ఇస్తారట. ప్రస్తుతం ఇండస్ట్రీలో నడుస్తున్న గాసిప్ ఇదే. వీళ్ళ ముగ్గురికి రూ.వంద కోట్లు ఇస్తే ఇక సినిమా మేకింగ్‌కు ఇంకెంత ఖర్చువుతుందో ఊహించుకోండి.
 
ఈ సినిమాను సుబ్బరామి రెడ్డి, అశ్వినీదత్ కలిసి సంయుక్తంగా నిర్మించబోతున్నారు. మరి దాదాపు 160 కోట్ల రూపాయల బడ్జెట్ ఉండే ఈ సినిమాకు ఎవరు ఎంత షేర్ పెడతారనేది సస్పెన్స్ త్వరలోనే ఈ సినిమా టెక్నీషియన్స్‌తో పాటు మరిన్ని వివరాలు బయటకు రాబోతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కబాలిని బీజేపీ సీఎం అభ్యర్థిగా బీజేపీ ప్రకటిస్తుందా? రజనీకాంత్ ఒప్పుకుంటారా?