Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టాలీవుడ్‌లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను.. రాధికా ఆప్టే

Advertiesment
Radhika Apte

సెల్వి

, సోమవారం, 19 ఫిబ్రవరి 2024 (10:31 IST)
సినీ నటి రాధికా ఆప్టే హిందీలోనే కాకుండా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా పనిచేసింది. తాజాగా, నటి పాత వీడియో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. ఇందులో రాధికా ఆప్టే తెలుగు చిత్ర పరిశ్రమపై విమర్శలు గుప్పించారు.
 
బయటపడిన ఈ పాత వీడియోలో, జర్నలిస్ట్‌తో సంభాషణ సందర్భంగా రాధికా ఆప్టే తెలుగు చిత్ర పరిశ్రమలో పురుషాధిక్యత అధికంగా కలగదని తెలిపింది. ఆ తర్వాత నటి ఇప్పుడు ట్రోల్స్‌కు గురి అయింది. రాధిక్ ఆప్టే ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది.  
 
వీడియోలో, రాధికా ఆప్టే మాట్లాడుతూ, "నేను ఎక్కువగా కష్టపడిన పరిశ్రమ తెలుగు చిత్ర పరిశ్రమ అని నేను అనుకుంటున్నాను. ఆ పరిశ్రమ పురుషుల ఆధిపత్యం, ఇది భరించలేనిది. టాలీవుడ్‌లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను." అని చెప్పింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వేదిక., అరవింద్ కృష్ణ ల సస్పెన్స్ చిత్రం ఫియర్