Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిర్మాతలను హీరోలు ఈ విషయంతో తొక్కేస్తున్నారా???

తెలుగు సినిమాలలో ఎంతో మంది పెద్ద నిర్మాణ సంస్థలు నడిపిన వారు కాలగర్భంలో కలిసిపోయారు. వారు తర్వాత తరం వారు తమ సంస్థలను అనేక కారణాలతో వారితో పాటుగా సమాధి చేసేసారు. అలాగా జరిగిన వాటిలో మొదటగా చెప్పుకోవాల

Advertiesment
Hero
, మంగళవారం, 20 జూన్ 2017 (11:46 IST)
తెలుగు సినిమాలలో ఎంతో మంది పెద్ద నిర్మాణ సంస్థలు నడిపిన వారు కాలగర్భంలో కలిసిపోయారు. వారు తర్వాత తరం వారు తమ సంస్థలను అనేక కారణాలతో వారితో పాటుగా సమాధి చేసేసారు. అలాగా జరిగిన వాటిలో మొదటగా చెప్పుకోవాల్సింది "మాయాబజార్" సినిమాను నిర్మించిన "విజయ వాహిని స్టూడియో". ఈ సినిమాను అప్పట్లో ఎంతో వ్యయప్రయాసలకోర్చి భారీ తారాగణంతో నాగిరెడ్డి - చక్రపాణి ద్వయం నిర్మించారు. ఎన్నో హిట్ చిత్రాలు అందించిన ఆ సంస్థ ఎప్పుడో కనుమరుగయ్యింది. "శంకరాభరణం", "సాగర సంగమం" వంటి తొమ్మిది వరుస హిట్లిచ్చిన ఏడిద నాగేశ్వరరావు గారి "పూర్ణోదయా మూవీ క్రియేషన్స్", అభిలాష, ఛాలెంజ్, చంటి వంటి ఎన్నో కమర్షియల్ చిత్రాలను తీసిన కె.ఎస్. రామారావు "క్రియేటివ్ కమర్షియల్స్", జగదేక వీరుడు అతిలోక సుందరి, చూడాలని ఉంది, రాజకుమారుడు వంటి హిట్లిచ్చిన సి.అశ్వినీదత్ "వైజయంతీ మూవీస్" వంటి ఎన్నో ప్రతిష్టాత్మకమైన సినిమా సంస్థలు ఇప్పుడు ఎక్కడా కనిపించకుండా పోయాయి. 
 
అందుకు కారణం లేకపోలేదు. ఎందుకంటే పాత తరం హీరోలను నుండి ప్రతి ఒక్క హీరో తమ సొంత లేదా వారి బంధువులకు సంబంధించిన బ్యానర్లలో సినిమాలు చేస్తుండడం. పాత తరం హీరోల నుండి కొత్త తరం వరకు చూస్తే, సీనియర్ ఎన్టీఆర్ - రామకృష్ణ సినీ స్టూడియోస్, ఏఎన్నార్ - అన్నపూర్ణ స్టూడియోస్, కృష్ణ- పద్మాలయా స్టూడియోస్, మహేష్ బాబు- జి. మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లిమిటెడ్ , చిరంజీవి-  అంజనా ప్రొడక్షన్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, అల్లూ వారి గీతా ఆర్ట్స్, పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, వెంకటేష్ - సురేష్ ప్రొడక్షన్స్, కృష్ణంరాజు - గోపీకృష్ణ మూవీస్. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది హీరోలు తమ సొంత నిర్మాణ సంస్థలతో కొత్తగా నిర్మాతలు అయ్యేవాళ్లకుదారులు మూసేస్తున్నారు. అందువలనే ఎంతో విలువలతో కూడిన సినిమా ప్రొడక్షన్‌ హౌస్‌లు సైతం కనుమరుగవుతున్నాయి. ఇకనైనా మన హీరోలు ఇతర నిర్మాణ సంస్థల సారథ్యంలో నటించి మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆశిద్దాం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్రాండ్ పియానో వాయించిన కలెక్షన్ కింగ్ .. ఎందుకు... ఎక్కడ? (Video)