Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రానావల్లే రూ.9 కోట్ల లాభం.. వరదల్లో ఆదుకున్నాడు.. నడిగర్ సంఘంకు..?!

Advertiesment
Hero Vishal Mass Entry @ Rayudu Movie Audio Launch
, గురువారం, 12 మే 2016 (11:08 IST)
నటుడు రానాది సహృదయం. విశాల్‌, రానా మంచి స్నేహితులు. ఇద్దరూ చెన్నైలో కలిసి కొన్నాళ్లు పెరిగారు. అయితే.. ఇటీవలే తమిళనాడులో వరదలు వచ్చిన సందర్భంగా... రానా, లక్ష్మీమంచు తదితర బృందమంతా... విశాల్‌కు చాలా సాయం చేశారట. అప్పటికి నడిగర్‌ సంఘం కార్యదర్శిగా విశాల్‌ ఎన్నికయ్యాడు. వరదల్లో అర్థరాత్రి 12గంటలకు ఫోన్లు వచ్చేవి. మా ప్రాంతంలో తినడానికి ఏమీలేదు. ఆదుకోండని.. అప్పటికిప్పుడు వెంటనే రానాకు ఫోన్‌ చేస్తే.. తెల్లారికల్లా.. లారీలతో సరుకులు వచ్చేవి. 
 
అవన్నీ.. ఎన్నో వేల కుటుంబాలకు సాయం అందించాను. అది నాకు తెలుసు.. రానా ఈజ్‌ గ్రేట్‌.. అంటూ కితాబిచ్చాడు... ఇంకో విషయం ఏమంటే.. నడిగర్‌ సంఘంలో ఫండ్‌ దుర్వినియోగం జరిగింది. లాస్‌లో వుంది. అలాంటిది.. రానాను మెంబర్‌ కావాలంటే.. వెంటనే 2లక్షలతో మెంబర్‌ అయ్యాడు. తర్వాత క్రికెట్‌మ్యాచ్‌కు సపోర్ట్‌ చేశారు. ఇప్పుడు రూ.9 కోట్ల మిగులు బడ్జెట్‌తో మా సంఘం నిలబడిందంటూ... రానాను ఆకాశానికి ఎత్తేశాడు విశాల్‌.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నటుడు గిరిబాబు సతీమణి శ్రీదేవి కన్నుమూత