Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హీరో రామ్‌కు గాయాలు-మెడ‌కు బ్యాండేజ్ ఫోటో వైరల్

హీరో రామ్‌కు గాయాలు-మెడ‌కు బ్యాండేజ్ ఫోటో వైరల్
, సోమవారం, 4 అక్టోబరు 2021 (13:10 IST)
Ram
టాలీవుడ్ హీరో రామ్‌కు గాయాలైనాయి. ద‌ర్శకుడు లింగుస్వామి డైరెక్షన్‌లో ఓ సినిమా చిత్రీకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం రామ్ త‌న లుక్‌ను పూర్తిగా మార్చుకుంటున్నాడు. బాడీని పెంచుకుంటున్నాడు.

ఈ క్రమంలో ఎక్సర్ సైజులు సైతం చేస్తున్న ఆయ‌న‌ మెడ‌కు గాయ‌మైంది. దీంతో షూటింగ్ నిలిచిపోయింది. మెడ‌కు బ్యాండేజ్ ఉన్న ఫొటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది.
 
‘రాపో 19’ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. ‘సీటీమార్’ చిత్రాన్ని నిర్మించిన శ్రీనివాస్ చిట్టూరి రామ్ 19 చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రీసెంట్‌గానే ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ షూటింగ్‌ను ప్రారంభించారు. రామ్ ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేస్తున్నాడు. ఇస్టార్ట్ శంకర్ కంటే ఈ సినిమాలో ఇంకా బీస్ట్ లుక్‌లో కనిపించాలని రామ్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భరణంగా రూ.200 కోట్లు.. నయాపైసా కూడా తీసుకోని సమంత?!