అమ్మతోడు..ఒట్టు.. నాకు, 'కలర్స్' స్వాతికి అఫైర్ లేదు : హీరో నిఖిల్
గత కొన్ని రోజులుగా నటి 'కలర్స్' స్వాతికి, హీరో నిఖిల్‌లు "ఆ" సంబంధం ఉన్నట్టు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోది. దీనిపై నిఖిల్ స్పందించాడు. నిజంగా, తనకు స్వాతికి ఎలాంటి అఫైర్ లేదని తేల్చి చెప్పాడు.
గత కొన్ని రోజులుగా నటి 'కలర్స్' స్వాతికి, హీరో నిఖిల్‌లు "ఆ" సంబంధం ఉన్నట్టు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోది. దీనిపై నిఖిల్ స్పందించాడు. నిజంగా, తనకు స్వాతికి ఎలాంటి అఫైర్ లేదని తేల్చి చెప్పాడు.
స్వాతి అద్భుతమైన నటి అని, మీడియాకు, అభిమానులకు అఫైర్స్ లాంటి స్పైసీ న్యూస్ ఉంటే బాగుంటుందని చురక అంటించాడు. అలా వచ్చిన రూమర్లే తనతో స్వాతి అఫైర్ అని చెప్పాడు. స్వాతి చాలా ప్రొఫెషనల్ నటి అని కితాబిచ్చాడు.
ఇకపోతే.. స్వాతి బిజీ హీరోయిన్ అని చెప్పిన నిఖిల్, అమెతో ఎప్పుడైనా ఒకసారి ఫోన్‌లో మాట్లాడుతానని, అంతకు మించి తమ మధ్య ఎలాంటి అనుబంధం లేదన్నాడు. స్వాతితో అఫైర్ అంటూ వచ్చిన వార్తలపై తామిద్దరం చాలాసార్లు వివరణ ఇచ్చామనీ, అయినా మీడియా మాత్రం నిరాధారమైన వార్తలను నిత్యం రాస్తోందంటూ నిఖిల్ వాపోయాడు.