కబాలి సినిమాకు ప్రస్తుతం డిస్ట్రిబ్యూటర్స్‌తో తలనొప్పి తప్పేలా లేదు. గతంలో కొచ్చాడియాన్ సినిమా తెలుగులో విక్రమసింహ పేరుతో రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సూపర్ స్టార్ కెరీర్ మొత్తంలో చెరుపుకోలేని మచ్చగా మిగిలిపోయింది విక్రమసింహ. ఈ మూవీకి వచ్చిన నష్టాలకు గాను రూ.7 కోట్లను తిరిగి చెల్లిస్తామని టాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లకు చెప్పారు. కానీ ఇప్పటివరకూ ఒక్క పైసా కూడా తిరిగివ్వకపోవడంతో కబాలికి కష్టాలు తప్పట్లేదు.
ప్రస్తుతం కబాలి రిలీజ్ సమయంలో వీరంతా అప్పటి అమౌంట్ గురించి పట్టుబడుతున్నారు. వీలైతే కబాలి రిలీజ్‌ను కూడా అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే రజినీకాంత్‌కు ఓ పిటిషన్ కూడా పంపబోతున్నారని తెలుస్తోంది. ఈ గొడవ కారణంగానే కబాలి తెలుగు వెర్షన్‌కు డిమాండ్ ఉన్నా డీల్ కుదరట్లేదని సమాచారం. మరి రజనీకాంత్ కొచ్చాడియాన్‌తో ఏర్పడిన కష్టాలను ఎలా తొలగించుకుంటారో వేచి చూడాల్సిందే.