Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తల వంచుకుని వెళ్లి, తలవంచుకుని ఇంటికి రా నాన్నా.. తైమూర్‌కు కరీనా హితబోధ

ఏ క్షణంలో తమకు పుట్టిన మగబిడ్డకు మంగోలు మహారాజు తైమూర్ అని కరీనా కపూర్‌ దంపతులు పేరు పెట్టుకున్నారో కానీ అప్పటినుంచి వీళ్లు సోషల్‌ మీడియాలో తలవాచిపోయేలా తిట్లు తింటున్నారు. పోయి పోయి మీకు ఆ తైమూర్ గాడ

తల వంచుకుని వెళ్లి, తలవంచుకుని ఇంటికి రా నాన్నా.. తైమూర్‌కు కరీనా హితబోధ
హైదరాబాద్ , శనివారం, 11 ఫిబ్రవరి 2017 (02:49 IST)
ఏ క్షణంలో తమకు పుట్టిన మగబిడ్డకు మంగోలు మహారాజు తైమూర్ అని కరీనా కపూర్‌ దంపతులు పేరు పెట్టుకున్నారో కానీ అప్పటినుంచి వీళ్లు సోషల్‌ మీడియాలో తలవాచిపోయేలా తిట్లు తింటున్నారు. పోయి పోయి మీకు ఆ తైమూర్ గాడే దొరికాడా, మరే పేర్లూ తట్టలేదా అంటూ ఆరోజునుంచి ఈ రోజు దాకా ఈ దంపతులకు అక్షింతలు పడుతూనే ఉన్నాయి. ఎందుకంటే భారత్‌పై దండయాత్రలో భాగంగా మధ్యయుగాల్లో తైమూర్ చేసిన బీభత్సం,  సల్పిన హింసాకాండ అంతా ఇంతా కాదు. ముస్లిం రాజులు గతంలో ఈ గడ్డపై మతం పేరుతో సాగించిన హింసాకాండను తల్చుకుంటేనే నెటిజన్లు శివాలెత్తిపోతున్నారు. అలాంటిది కరీనా, సైఫ్ లాంటి సెలెబ్రిటీలు తమ కొడుక్కి తైమూరు పేరు పెట్టుకుంటే నెటిజన్లు సహిస్తారా?  ‘అయినా సరే, అవన్నీ మేము పట్టించుకోము’ అని పొత్తిళ్లలోని బిడ్డను ముద్దాడుతూ మురిపెంగా చెబుతున్నారు కరీనా. 
 
తైమూర్‌ పేరు మీదే మొఘల్‌ సామ్రాజ్యం అవతరించింది. అతడి అసలు పేరు అమీర్‌ తైమూర్‌. ఉజ్బెకిస్థాన్‌లో పుట్టాడు. 68 ఏళ్లు జీవించాడు. (1336–1405). చంగీజ్‌ఖాన్‌లా ప్రపంచాన్ని జయించాలని బయల్దేరాడు. దండయాత్రలు చేశాడు. ఐరోపా, చైనా, అరబ్బు రాజ్యాలతో పాటు భారతదేశంలోనూ రక్తపాతం సృష్టించాడు.
 
హిందూదేశంలో ఈ తురుష్క చక్రవర్తి చేసిన ఆగడాలకు అంతేలేదని చరిత్రకారులు రాశారు కూడా. అలాంటి వాడి పేరును పెట్టుకోవడం ఏంటని నెట్‌ ఇంట ఇప్పుడు డిస్కషన్‌ నడుస్తోంది. ‘వీటన్నిటినీ మేమెలాగైతే పట్టించుకోవడం లేదో, నువ్వూ అలాగే నీ చుట్టూ జరుగుతున్న వాటి గురించి పట్టించుకోవద్దనీ, తల వంచుకుని వెళ్లి, తల వంచుకుని ఇంటికి రమ్మనీ..’ తన కొడుక్కి చెప్తానని కరీనా అంటోంది. అవున్నిజమే అని సైఫ్‌ కూడా అంటున్నాడు. ఇప్పటికైతే.. తైమూర్‌ని తప్ప ఎవర్నీ పట్టించుకునే తీరికలో లేరు.   
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కళ్యాణ్‌ను దాటి నంది ముందుకెళుతుందా..!