'జనతా గ్యారేజ్'ను క్రాస్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... సినిమా చూపించాడు.. ఎక్కడ?
జూనియర్ ఎన్టీఆర్ చిత్రం జనతా గ్యారేజ్ విడుదలై విజయవంతంగా ఆడుతోంది. ఐతే ఇవాళ.. అంటే సెప్టెంబరు 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పనవ్ కళ్యాణ్ ట్వీట్లతోనూ, ఫేస్ బుక్ పో
జూనియర్ ఎన్టీఆర్ చిత్రం జనతా గ్యారేజ్ విడుదలై విజయవంతంగా ఆడుతోంది. ఐతే ఇవాళ.. అంటే సెప్టెంబరు 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పనవ్ కళ్యాణ్ ట్వీట్లతోనూ, ఫేస్ బుక్ పోస్టింగులతోనూ సామాజిక నెట్వర్కింగ్ సైట్లు హోరెత్తిపోతున్నాయి. దీనితో #HBDPawanKalyan అనే ట్యాగ్ #JanathaGarageను క్రాస్ చేసి దూసుకుపోతోంది.
ఇక పవన్ కళ్యాణ్ అభిమానులైతే పవన్ పోస్టర్లను తమతమ వాహనాలపైన వేసుకుని సందడి చేస్తున్నారు. మనం కూడా పవన్ కళ్యాణ్‌కు #HBDPawanKalyan చెప్పేద్దాం.