Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎస్ బాస్ అంటూ షూటింగ్ పూర్తి చేసుకున్న హీరో హ‌వీష్‌

Haveesh

డీవీ

, మంగళవారం, 25 జూన్ 2024 (12:45 IST)
Haveesh
‘నువ్విలా’ చిత్రంతో సినీ రంగ ప్ర‌వేశం చేసిన హ‌వీష్, ‘రామ్ లీల‌’, ‘జీనియ‌స్’ వంటి చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన సంగ‌తి తెలిసిందే. మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ ‘సెవన్’ తర్వాత డైన‌మిక్ యాక్ట‌ర్ హ‌వీష్‘ఎస్ బాస్’ చిత్రంలో హీరోగా న‌టిస్తున్నారు. కాంచ‌న కోనేరు స‌మ‌ర్ప‌ణ‌లో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ప్ర‌ముఖ నిర్మాత‌, విద్యావేత్త‌, కె.ఎల్‌.యూనివ‌ర్సిటీ చైర్మ‌న్ కొనేరు స‌త్య‌నారాయ‌ణ కుమారుడే హవీష్. కె స్టూడియోస్ బ్యానర్‌పై ‘రాక్ష‌సుడు’, ‘ఖిలాడి’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను నిర్మించిన హవీష్ ఇప్పుడు త‌న త‌దుపరి చిత్రం ‘ఎస్ బాస్’ను రూపొందిస్తున్నారు.
 
‘భాగమతి’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాన్ని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు అశోక్ ‘ఎస్ బాస్’ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఇది ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌లా అన్నీ అంశాల‌తో రూపొందుతోంది. మంగ‌ళ‌వారం హ‌వీష్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఎస్ బాస్ చిత్రం నుంచి హ‌వీష్ స్టైలిష్ లుక్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. 
 
డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్క‌తోన్న ‘ఎస్ బాస్’ చిత్రంలో ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్ర‌ధానంగా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోనుంది. ప్ర‌ముఖ ర‌చ‌యిత ఆకుల శివ ఈ చిత్రాన్ని క‌థ‌, మాట‌ల‌ను అందించారు. సీనియ‌ర్ స్టార్ క‌మెడియ‌న్ బ్ర‌హ్మానందం ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌ను పోషించారు. ఆయ‌న ఈ చిత్రంలో న‌టిస్తుండ‌టంతో ఎంట‌ర్‌టైన్‌మెంట్ నెక్ట్స్ రేంజ్‌లో ఉంటుంద‌న‌టంలో సందేహం లేదు. ప్ర‌ముఖ టెక్నీషియ‌న్ క‌బీర్ లాల్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నార్నే నితిన్, నయన్ సారిక నటిస్తున్న ఆయ్ చిత్రం రిలీజ్ డేట్ ప్రకటన