Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి నుండి ధనుష్ పాడిన హతవిధి సాంగ్ అదుర్స్

Naveen Polishetty,
, బుధవారం, 31 మే 2023 (16:09 IST)
Naveen Polishetty,
నవీన్ పొలిశెట్టి మరియు అనుష్క శెట్టి నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి నుంచి విడుదలైన టీజర్ ఇప్పటికే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడం. అంతేకాదు మహేష్ బాబు పి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుండి కొన్ని రోజుల క్రితం విడుదలైన మొదటి సాంగ్ కూడా ఇంటర్నెట్‌లో మంచి స్పందన తెచ్చుకొని అందరిని అలరింస్తోంది. ఇక ఈరోజు ఈ చిత్రం నుండి మరో పాట ని విడుదల చేశారు ఈ సినిమా మేకర్స్. ఈ సాంగ్ ని హీరో ధనుష్ పాడడం విశేషం.
 
ధనుష్ గతంలో కూడా ఎన్నో సాంగ్స్ ని పాడి అల్లరించారు. అందుకే సింగర్ గా ఆయన ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ముఖ్యంగా ఈయన పాడిన కొలవరి ది ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో మనందరికీ తెలుసు. ఇక ఇప్పుడు తన గాత్రంతో హతవిధి సాంగ్ కి మరికొంత వన్నె తెచ్చిపెట్టారు ఈ హీరో.
 
ఇక మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిలోని ఈ రెండవ పాట హతవిధిని ఈ రోజు చిత్ర నిర్మాతలు ఆవిష్కరించారు. విడుదలైన కాసేపట్లోనే ఈ సాంగ్ చార్ట్‌బస్టర్ గా నిలిచింది. నవీన్ పొలిశెట్టి నిస్పృహతో అరిచే వాయిస్ తో ఈ పాట మొదలవుతుంది. హీరో తన భవిష్యత్తు తెలుసుకోవాలని ఒక చిలక దగ్గరకు వెళితే ఆ చిలక కూడా పారిపోతుంది. అలా తన లైఫ్ లో ఏదీ గొప్పగా చేయాలనుకున్న అది అనుకున్నట్టు జరగకపోవడం అనే కాన్సెప్ట్ తో సాంగ్ కొనసాగుతుంది.
 
అంతేకాదు తనకు ఎదురవుతున్న సంఘటనల వల్ల హీరో ఎంత నిరుత్సాహానికి లోనవుతాడో అనే విషయాన్ని దర్శకుడు ఈ పాటలో స్పష్టంగా చూపించబోతున్నారు అనే విషయం ఈ సాంగ్ విన్న ఎవరికైనా అర్థమవుతుంది. ఇక లిరిక్స్ విషయానికి వస్తే 'బుల్లిచీమ బతుకుపై... బుల్డోజరైందాయ్' అనే పంచులతో మిస్టర్ శెట్టి జీవితాన్ని స్పష్టంగా వివరిస్తుంది ఈ పాట. ఇక ఇంత మంచి లిరిక్స్ ని ఈ సాంగ్ కి రామజోగయ్య శాస్త్రి అందించడం మరో విశేషం.
 
ధనుష్ గొంతు మరియు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ తో పాటు  సంగీత దర్శకుడు రధన్ మ్యూజిక్ ఈ సాంగ్ ని ప్రేక్షకులకు మరింత దగ్గర చేస్తుంది. మరో విశేషం ఏమిటి అంటే ఈ సాంగ్ విన్న ప్రతి ఒక్కరు ఈ సాంగ్ కి ఏదో ఒక లిరిక్ దగ్గర తమ లైఫ్ గుర్తు చేసుకోక మానరు.
 
ఇక సినిమా విషయానికి వస్తే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రానికి మహేష్ బాబు.పి దర్శకత్వం వహించగా యువి క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. ఈ పూర్తి స్థాయి కామెడీ సినిమాలో నవీన్ మరియు అనుష్క ప్రధాన పాత్రలు పోషించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హార్డ్ వర్క్ ఎప్పుడూ ఫెయిల్ కాదు : ఆపరేషన్ రావణ్ ఫస్ట్ థ్రిల్ లాంచ్ లో రాధికా