Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాటమరాయుడు సెట్లో శ్రుతి హాసన్ బర్త్ డే... 'కాటమరాయుడు' ఎక్కడ?

ఒకవైపు రాజకీయ పార్టీ వ్యవహారాలు, మరోవైపు సినిమా నిర్వహణలో బిజీగా వున్న పవన్‌ కళ్యాణ్‌ 'కాటమరాయుడు' చిత్రం షూటింగ్‌లో శనివారంనాడు బిజీగా వున్నారు. ఈ చిత్రం తర్వాత మరో రెండు సినిమాల్లో నటించాల్సి వుంది. ప్రస్తుతం పాటల చిత్రీకరణకు సిద్ధమవుతున్న టీమ్‌ ఫ

కాటమరాయుడు సెట్లో శ్రుతి హాసన్ బర్త్ డే... 'కాటమరాయుడు' ఎక్కడ?
, శనివారం, 28 జనవరి 2017 (17:27 IST)
ఒకవైపు రాజకీయ పార్టీ  వ్యవహారాలు, మరోవైపు సినిమా నిర్వహణలో బిజీగా వున్న పవన్‌ కళ్యాణ్‌ 'కాటమరాయుడు' చిత్రం షూటింగ్‌లో శనివారంనాడు బిజీగా వున్నారు. ఈ చిత్రం తర్వాత మరో రెండు సినిమాల్లో నటించాల్సి వుంది. ప్రస్తుతం పాటల చిత్రీకరణకు సిద్ధమవుతున్న టీమ్‌ ఫిబ్రవరి మొదటి వారంలో ఫారిన్‌ షెడ్యూల్‌‌కు వెళ్లే అవకాశముందని తెలుస్తోంది. 
 
అనంతరం మార్చి లోగా సినిమా పోస్ట్‌ప్రొడక్షన్‌ పూర్తిచేసి, మార్చి నెల చివరిలో రిలీజ్‌ చేసే ఆలోచనలో వున్నారు. అనుకున్నట్లు జరిగితే రిపబ్లిక్‌డే నాడే చిత్ర టీజర్‌ విడుదలవ్వాల్సింది. కానీ జరగలేదు. నార్త్‌ స్టార్‌ ఎంటర్టైన్మెంట్స్‌ పతాకంపై శరత్‌ మరార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు. కాటమరాయుడు షూటింగ్ స్పాట్లోనే శ్రుతి హాసన్ పుట్టినరోజు వేడుక జరుపుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఘాజీకి చిరంజీవి వాయిస్ ఓవర్.. తమిళంలో సూర్య, హిందీలో అమితాబ్ బచ్చన్