Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఘాజీకి చిరంజీవి వాయిస్ ఓవర్.. తమిళంలో సూర్య, హిందీలో అమితాబ్ బచ్చన్

అనుష్క ప్రధాన పాత్రధారిగా గుణశేఖర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న రుద్రమదేవి సినిమాకు వాయిస్ ఇచ్చిన.. మెగాస్టార్ చిరంజీవి రానా సినిమాకు కూడా వాయిస్ ఓవర్ చేశారు. రానా- తాప్సీ జంటగా తెలుగు, హిందీ, తమిళంలో

ఘాజీకి చిరంజీవి వాయిస్ ఓవర్.. తమిళంలో సూర్య, హిందీలో అమితాబ్ బచ్చన్
, శనివారం, 28 జనవరి 2017 (17:02 IST)
అనుష్క ప్రధాన పాత్రధారిగా గుణశేఖర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న రుద్రమదేవి సినిమాకు వాయిస్ ఇచ్చిన.. మెగాస్టార్ చిరంజీవి రానా సినిమాకు కూడా వాయిస్ ఓవర్ చేశారు. రానా- తాప్సీ జంటగా తెలుగు, హిందీ, తమిళంలో వస్తున్న మూవీ ఘాజీ. సంకల్ప్ డైరెక్ట్ చేస్తున్న 'ఘాజీ'ని ఫిబ్రవరి 17న రిలీజ్ చేయాలని యూనిట్ భావిస్తోంది.

భారత్-పాకిస్తాన్‌ల మధ్య 1971లో జరిగిన వార్ నేపథ్యంలో తెరకెక్కించిన ఫిల్మ్ ఇది. ఈ తరహా కాన్సెప్ట్‌తో ఇండియాలో ఇప్పటివరకు సినిమా రాలేదు. పీవీపీ బ్యానర్- మ్యాటినీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. 
 
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఘాజీ తెలుగు వెర్షన్‌కు మెగాస్టార్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. దీనికి సంబంధించిన పనులు ఫిబ్రవరి తొలి వారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక తమిళ వెర్షన్‌కి సూర్య, హిందీకి అమితాబ్‌లు వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సమంత మాట మార్చింది... పెళ్లయినా వాటికి నో బ్రేక్... అక్కినేని ప్రొడక్షన్స్ లాంఛ్ చేస్తుందా?