Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సమంత మాట మార్చింది... పెళ్లయినా వాటికి నో బ్రేక్... అక్కినేని ప్రొడక్షన్స్ లాంఛ్ చేస్తుందా?

పెళ్లి నిశ్చయమైన తర్వాత రెండు తమిళ సినిమాలను మాత్రమే చేస్తానన్న సమంత.. ఇప్పుడు మరో రెండు సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇటీవలే రామ్‌ చరణ్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇది కాకుండా కన్నడ సినిమా 'యూ టర్న్‌' రీమే

సమంత మాట మార్చింది... పెళ్లయినా వాటికి నో బ్రేక్... అక్కినేని ప్రొడక్షన్స్ లాంఛ్ చేస్తుందా?
, శనివారం, 28 జనవరి 2017 (16:58 IST)
పెళ్లి నిశ్చయమైన తర్వాత రెండు తమిళ సినిమాలను మాత్రమే చేస్తానన్న సమంత.. ఇప్పుడు మరో రెండు సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇటీవలే రామ్‌ చరణ్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇది కాకుండా కన్నడ సినిమా 'యూ టర్న్‌' రీమేక్‌ను తమిళంలో చేయనున్నారు. దీన్ని తెలుగులో కూడా ఒకేసారి చేస్తున్నట్లు చెబుతున్నారు. 
 
అయితే ఈ సినిమాను తనే నిర్మాతగా వుండాలని మొదట్లో అనుకున్నా ఇప్పటి పరిస్థితుల్లో వీలుకాదని తెలిపింది. కేవలం నటించడానికే అవకాశముందని చెబుతోంది. ఈ సినిమాకు నిర్మాతలుగా నాగచైతన్యకు సన్నిహితులు వున్నవారు వుంటారని వార్తలు విన్పిస్తున్నాయి. త్వరలో ఆ నిర్మాతలెవరనేది ఫైనల్‌ చేయనున్నారు. ఐతే రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ ప్రారంభించినట్లుగా నాగచైతన్య అక్కినేని ప్రొడక్షన్స్ ప్రారంభిస్తారేమోనంటూ కొందరు అనుకుంటున్నారు. కాగా ఈ చిత్రానికి ఒరిజినల్‌ డైరెక్టర్‌ పవన్‌ కుమార్‌ దర్శకత్వ బాధ్యతలు నిర్వహించనున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'నేనే రాజు నేనే మంత్రి'లో న్యూస్ ఛానల్‌ బాస్‌గా కేథరిన్.. ఖైదీకి తర్వాత..?