బాలీవుడ్ అందాల నటి అనుష్క శర్మకు ఆదివారం (మే 1) పుట్టిన రోజు. అనుష్క పుట్టిన రోజును పురస్కరించుకుని బాలీవుడ్ నటులు రణ్‌బీర్ కపూర్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, అనుష్క శర్మ తారాగణంలో రూపుదిద్దుకునే ‘యే దిల్‌హై ముష్కిల్’ సినిమా స్టిల్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమా షూటింగ్‌లో తీసిన స్టిల్‌ను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ట్వీట్‌లో కరణ్ జోహార్ అనుష్క శర్మకు శుభాకాంక్షలు తెలిపారు.
కాగా ‘యే దిల్‌హై ముష్కిల్’ సినిమాకు కరణ్ జోహార్ దర్శకత్వం వహించడంతో పాటు ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. అక్టోబర్ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సర్వం సిద్ధమవుతోంది. అయితే అనుష్క శర్మకు క్రికెటర్, లవర్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేయలేదు. అనుష్క శర్మకు విరాట్ కోహ్లీ బర్త్ డే విషెస్ చెప్పకపోవడంపై పలు రకాలుగా వార్తలొస్తున్నాయి.