Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

Hansika as Sri Gandhari

డీవీ

, బుధవారం, 27 నవంబరు 2024 (19:41 IST)
Hansika as Sri Gandhari
హారర్ చిత్రాలపై ఆడియెన్స్‌కి ఎప్పుడూ ఓ అంచనాలుంటాయి. ఈ మధ్య నవ్విస్తూనే భయపెట్టించే చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. హారర్ జానర్ ఎప్పుడూ ఎవర్ గ్రీన్‌గానే ఉంటుంది. ఈ క్రమంలోనే అందాల తార హన్సిక ‘శ్రీ గాంధారి’ అంటూ భయపెట్టించేందుకు వస్తున్నారు. మసాలా పిక్స్ బ్యానర్‌పై ఆర్ కన్నన్ దర్శకత్వం వహిస్తూ నిర్మించారు.

ఇక ఈ చిత్రాన్ని సరస్వతి డెవలపర్స్‌తో కలిసి లచ్చురం ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రాజు నాయక్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.. ఈ మూవీని వీకేఆర్ (విక్రమ్ కుమార్ రెజింతల) సమర్పిస్తున్నారు. 
 
హిందూ ట్రస్ట్ కమిటీకి హెడ్ ఆఫీసర్‌గా పనిచేసే యువతిగా హన్సిక ఈ చిత్రంలో నటించారు. ఆమె 'గంధర్వ కోట' పురాతన స్మారకానికి సంబంధించిన పరిశోధన ప్రాజెక్ట్‌ను చేపట్టడంతో అసలు కథ మొదలవుతుంది. ఒక రాజు నిర్మించిన శతాబ్దాల నాటి ఈ కోటలో ఎన్నో రహస్యాలుంటాయి. ఆ రహస్యాల్ని ఎలా బయటకు తీసుకు వచ్చారు? అన్నది కథ.
 
ఈ మేరకు గతంలోనే రిలీజ్ చేసిన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. ఇక ట్రైలర్‌లో హన్సిక లుక్స్, యాక్టింగ్ చాలా కొత్తగా అనిపించాయి. ఇతర ఆర్టిస్టుల లుక్స్, వేరే భాషల్లో చెప్పిన డైలాగ్స్ ఆసక్తి రేకెత్తిస్తాయి. ఈ చిత్రంలో మెట్రో శిరీష్, మయిల్‌సామి, తలైవాసల్ విజయ్, ఆడుకాలం నరేన్, స్టంట్ సిల్వా, వినోదిని, పవన్, బ్రిగిడా సాగా, వడివేల్ మురుగన్, కలైరాణి వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు.
 
శ్రీ గాంధారి కథను తొల్కప్పియన్, స్క్రీన్ ప్లేని ధనంజయన్ అందించారు. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా బాల సుబ్రమణియన్, మ్యూజిక్ కంపోజర్‌గా ఎల్వీ గణేష్ ముత్తు, ఎడిటర్‌గా జిజింత్ర, సిల్వా స్టంట్ డైరెక్టర్‌గా పని చేశారు.
 
మిస్టరీ, సస్పెన్స్, హారర్, థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘శ్రీ గాంధారి’ చిత్రాన్ని డిసెంబర్‌లో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు రాజు నాయక్ సన్నాహాలు చేస్తున్నారు.
 
నటీనటులు : హన్సిక, మెట్రో శిరీష్, మయిల్‌సామి, తలైవాసల్ విజయ్, ఆడుకాలం నరేన్, స్టంట్ సిల్వా, వినోదిని, పవన్, బ్రిగిడా సాగా, వడివేల్ మురుగన్, కలైరాణి తదితరులు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్