Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

న్యూయార్క్‌లో గ్రాఫిక్‌ వర్క్‌ జరుపుకుంటున్న 'రాక్షసి'

'కాలింగ్‌ బెల్‌' చిత్రంతో అందరి ప్రశంసలు అందుకున్న దర్శకుడు పన్నా రాయల్‌ ఆ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిస్తున్న మరో హార్రర్‌ ఎంటర్‌టైనర్‌ 'రాక్షసి'. పూర్ణ ప్రధాన పాత్రలో అభినవ్‌ సర్దార్‌, అభిమన్యు సి

న్యూయార్క్‌లో గ్రాఫిక్‌ వర్క్‌ జరుపుకుంటున్న 'రాక్షసి'
, ఆదివారం, 29 జనవరి 2017 (17:57 IST)
'కాలింగ్‌ బెల్‌' చిత్రంతో అందరి ప్రశంసలు అందుకున్న దర్శకుడు పన్నా రాయల్‌ ఆ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిస్తున్న మరో హార్రర్‌ ఎంటర్‌టైనర్‌ 'రాక్షసి'. పూర్ణ ప్రధాన పాత్రలో అభినవ్‌ సర్దార్‌, అభిమన్యు సింగ్‌, గీతాంజలి ముఖ్యపాత్రల్లో డ్రీమ్‌ క్యాచర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై అశోక్‌ మందా, రాజ్‌ దళవాయ్‌, టోనీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

షూటింగ్‌ పూర్తి చేసుకొని పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌లో భాగంగా ఈ చిత్రానికి సంబంధించిన గ్రాఫిక్‌ వర్క్‌ను న్యూయార్క్‌లో చేస్తున్నారు. త్వరలోనే ఆడియో రిలీజ్‌ చేసి ఫిబ్రవరిలో చిత్రాన్ని విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 
 
ఈ సందర్భంగా దర్శకుడు పన్నా రాయల్‌ మాట్లాడుతూ... ''కాలింగ్‌ బెల్‌ కంటే టెక్నికల్‌గా ఎన్నో రెట్లు స్టాండర్డ్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. సినిమా క్వాలిటీగా రావడం కోసం గ్రాఫిక్‌ వర్క్‌ను న్యూయార్క్‌లో చేయిస్తున్నాం. కంటెంట్‌ పరంగా, టెక్నికల్‌గా ఎన్నో ప్రత్యేకతలు వున్న ఈ చిత్రంలో పూర్ణపై చిత్రీకరించిన ఓ సాంగ్‌ సినిమాకే హైలైట్‌ అవుతుంది. నాలుగు నిముషాల నిడివి వుండే ఈ సాంగ్‌ని పూర్తిగా విజువల్‌ ఎఫెక్ట్స్‌లో చిత్రీకరించడం జరిగింది.

ఈ పాట ఆడియన్స్‌కి ఓ డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది. నేను అనుకున్నది హండ్రెడ్‌ పర్సెంట్‌ స్క్రీన్‌పై చూపించడంలో మా నిర్మాతల సహకారం ఎంతో వుంది. ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా చిత్రాన్ని చాలా రిచ్‌గా నిర్మించారు. 'రాక్షసి' ఈమధ్య కాలంలో వచ్చిన హార్రర్‌ చిత్రాల్లో ఓ డిఫరెంట్‌ మూవీ అవుతుందని ఖచ్ఛితంగా చెప్పగలను'' అన్నారు. 
 
నిర్మాతలు అశోక్‌ మందా, రాజ్‌ దళవాయ్‌, టోనీ మాట్లాడుతూ.. ''ఒక మంచి చిత్రంతో మా బేనర్‌ను స్టార్ట్‌ చేసినందుకు చాలా సంతోషంగా వుంది. పన్నా రాయల్‌ చెప్పిన కథ మాకెంతో నచ్చింది. అతను చెప్పిన దానికంటే ఎన్నో రెట్లు అద్భుతంగా స్క్రీన్‌ మీద చూపించాడు.

క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో ఈ చిత్రాన్ని నిర్మించాం. త్వరలోనే ఆడియో రిలీజ్‌ చేసి, ఫిబ్రవరిలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన్న చిరంజీవి, తమ్ముడు పవన్‌ను ఎవరైనా ఏమన్నా అంటే?: నాగబాబు