Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్లైండ్‌గా నమ్మేశా... 'నా పేరు సూర్య'తో హ్యాట్రిక్ విజయం కొట్టాలి : అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటించిన చిత్రం 'నా పేరు సూర్య... నా ఇల్లు ఇండియా'. ఈ చిత్రం ప్రీరిలీజ్ ఫంక్షన్ ఆదివారం జరిగింది. ఇందులో హీరో అల్లు అర్జున్ స్పందిస్తూ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ న

Advertiesment
బ్లైండ్‌గా నమ్మేశా... 'నా పేరు సూర్య'తో హ్యాట్రిక్ విజయం కొట్టాలి : అల్లు అర్జున్
, సోమవారం, 30 ఏప్రియల్ 2018 (11:39 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటించిన చిత్రం 'నా పేరు సూర్య... నా ఇల్లు ఇండియా'. ఈ చిత్రం ప్రీరిలీజ్ ఫంక్షన్ ఆదివారం జరిగింది. ఇందులో హీరో అల్లు అర్జున్ స్పందిస్తూ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'రంగస్థలం', మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' చిత్రాల విజయవంతం తర్వాత తాను నటించిన 'నా పేరు సూర్య' చిత్రంతో హ్యాట్రిక్ విజయాలు నమోదవ్వాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.
 
అలాలగే, త్వరలో విడుదలయ్యే 'మహానటి', 'మెహబూబా' చిత్రాలు కూడా హిట్ కావాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. నిజాయితీతో కూడిన సినిమా ఒకటి చేయాలన్న తన చిరకాల కోరిక ఈ చిత్రంతో తీరిందని అన్నాడు. ఈ సినిమాను తాను వంశీని నమ్మి చేశానని, ఇది ప్రతి ఒక్కరూ గర్వపడేలా ఉంటుందని, ఇంతకన్నా ప్రస్తుతానికి ఇంకేమీ చెప్పలేనన్నాడు. 'రంగస్థలం'తో చరణ్ కేవలం హిట్ కొట్టడమే కాకుండా పరిశ్రమని మరో మెట్టు ఎక్కించాడని, మహేష్ నటించిన 'భరత్ అనే నేను' మంచి కలెక్షన్లతో దూసుకెళుతోందన్నాడు. ఇక తన సినిమా దాసరి నారాయణరావు పుట్టిన రోజున విడుదల కావడం తనకెంతో సంతోషాన్ని కలిగిస్తోందని చెప్పాడు. 
 
ఇకపోతే, ఈ సినిమాకి కెప్టెన్ వక్కంతం వంశీగారు. నాకు ఎప్పటి నుంచో ఒకలాంటి సినిమా చేయాలి. నిజాయితీ ఉన్న సినిమా చేయాలనే కోరిక ఉండేది. నా కోరికకి, మీ కథకి కలిసిన క్షణమే నా అదృష్టం. అందరూ అనుకుంటారేమో.. వంశీగారు కొత్త డైరెక్టర్ కదా! సపోర్టింగ్, ప్యాడింగ్ ఎక్కువ పెట్టి ఈ సినిమా పుష్ చేశారని అనుకుంటారేమో.. కాదు. హండ్రెడ్ పర్సంట్ కాదు. రేపు ఈ సినిమా సక్సెస్ అయితే.. ఆ సక్సెస్‌కి వంద కారణాలుంటే.. ఆ వందా డైరెక్టర్‌గారే. నేను ఆయనని నమ్మాను. బ్లైండ్‌గా నమ్మాను. ఎవరు ఎలా చేసినా, డైరెక్టర్ బాగా చేస్తేనే సినిమా హిట్ అవుతుంది. ఈ సినిమానే కాదు ఏ సినిమాకి అయినా డైరెక్టరే కెప్టెన్. నిజంగా మేమందరం గర్వపడే సినిమా మీరు ఇస్తున్నారని నమ్ముతున్నట్టు చెప్పాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెగా పవర్ స్టార్‌ చెర్రీపై ఐటీ మంత్రి నారా లోకేష్ ప్రశంసల వర్షం.. ఎందుకు?