Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాలీవుడ్ చిత్రంగా విజయ్ మాల్యా బయోపిక్... హీరో గోవింద

లిక్కర్ డాన్ విజయ్ మాల్యా జీవిత చరిత్ర ఆధారంగా ఓ బాలీవుడ్ చిత్రం తెరకెక్కుతోంది. ఈచిత్రంలో బాలీవుడ్ సీనియర్ హీరో గోవింద హీరోగా నటిస్తున్నారు. ఈ విషయాన్ని సెన్సార్‌ బోర్డు మాజీ చీఫ్‌, దర్శకుడు పహ్లజ్‌

బాలీవుడ్ చిత్రంగా విజయ్ మాల్యా బయోపిక్... హీరో గోవింద
, బుధవారం, 30 మే 2018 (12:27 IST)
లిక్కర్ డాన్ విజయ్ మాల్యా జీవిత చరిత్ర ఆధారంగా ఓ బాలీవుడ్ చిత్రం తెరకెక్కుతోంది. ఈచిత్రంలో బాలీవుడ్ సీనియర్ హీరో గోవింద హీరోగా నటిస్తున్నారు. ఈ విషయాన్ని సెన్సార్‌ బోర్డు మాజీ చీఫ్‌, దర్శకుడు పహ్లజ్‌ నిహ్లానీ వెల్లడించారు. 
 
ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడిపే వ్యక్తుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన విజయ్ మాల్యా భారత్‌లోని డజనుకు పైగా బ్యాంకుల్లో రూ.9 వేల కోట్ల రుణాలు తీసుకుని ఎగ్గొట్టి బ్రిటన్‌కు పారిపోయాడు. ప్రస్తుతం ఈయన లండన్‌లో ఉంటున్నాడు.
 
ఇక్కడ వారానికి 5 వేల పౌండ్ల (రూ.4.5 లక్షల) చెల్లిస్తూ జీవనం సాగిస్తున్నట్లు తెలుస్తున్నది. మాల్యాను భారత్‌కు అప్పగించాలన్న కేసుపై లండన్‌లో విచారణ జరుపుతున్న వెస్ట్‌మినిస్టర్ కోర్టు కేసుని ప‌రిశీలిస్తుంది. 
 
ఈ నేపథ్యంలో త్వ‌ర‌లో ఈయ‌న‌పై బ‌యోపిక్ రూపొందించ‌నుంది. బాలీవుడ్‌లో బ‌యోపిక్‌ల హ‌వా జోరుగా నడుస్తున్న క్ర‌మంలో మాల్యా బ‌యోపిక్ వార్త హాట్ టాపిక్‌గా మారింది.
 
ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ హీరో గోవింద ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఓ పాటను షూట్ చేశారట. చిన్ని ప్ర‌కాశ్ కొరియోగ్ర‌ఫీ చేసిన సాంగ్ బాగా వ‌చ్చింద‌ని దర్శకుడు పహ్లజ్‌ నిహ్లానీ వెల్లడించారు. 
 
గోవింద ప్ర‌ధాన పాత్ర‌లో రూపొంద‌నున్న ఈ బ‌యోపిక్‌లో బ్యాంక్ స్కాం స‌న్నివేశాల‌ని వినోదాత్మ‌కంగా తెర‌కెక్కించనున్నట్టు చెప్పారు. చిత్రంలో గోవిందా గెట‌ప్ చాలా డిఫ‌రెంట్‌గా ఉంటుంద‌ని, గ‌తంలోక‌న్నా ఆయ‌న ఇప్పుడే ఫిట్‌గా ఉన్నారన్నారు. అయితే, ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించాల్సి వుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంగళసూత్రాన్ని చేతికి ధరిస్తానంటున్న బాలీవుడ్ నటి.. ఎవరు?