Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'విజయాలు మన చేతిలో ఉండవు... అయినా అదే నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌' : పూజా హెగ్డే

విజయాలు మన చేతిలో ఉండవని.. అయినప్పటికీ.. అదే నా డ్రీమ్ ప్రాజెక్టు అని నటి పూజా హెగ్డే చెపుతోంది. ఈ నటి 'ఒ క లైలా కోసం'.. 'ముకుందా' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తర్వాత 'మొహెంజొదారో'తో బాలీ

Advertiesment
Pooja Hegde
, సోమవారం, 28 నవంబరు 2016 (14:39 IST)
విజయాలు మన చేతిలో ఉండవని.. అయినప్పటికీ.. అదే నా డ్రీమ్ ప్రాజెక్టు అని నటి పూజా హెగ్డే చెపుతోంది. ఈ నటి 'ఒ క లైలా కోసం'.. 'ముకుందా' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తర్వాత 'మొహెంజొదారో'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ ప్రాజెక్టుపై భారీ ఆశలు పెట్టుకుంది. అయితే ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. 
 
ఈ విషయంపై ఆమె స్పందిస్తూ.. ''విజయాలు మన చేతిలో ఉండవు. 'మొహెంజొదారో' బాగా ఆడకపోయినా నాకు రావాల్సిన గుర్తింపు వచ్చిందనే భావిస్తున్నా. కానీ అదృష్టవశాత్తూ వాళ్లకు నా నటన నచ్చింది. ఆ చిత్రం విడుదలయ్యాక కొన్ని రివ్యూలు చూశా. అందులో నా పాత్ర నిడివి తగ్గిందని.. పాత్ర పరిధి మరింత ఉంటే బావుండేదని రాశారు. అంటే నా పాత్ర వాళ్లకు నచ్చిందనే అనుకుంటున్నా. ఫలితం ఎలాగున్నా.. ఆ సినిమానే ఎప్పటికీ నా డ్రీమ్‌ ప్రాజెక్టుగా ఉండిపోతుంది'' అని చెప్పుకొచ్చింది. ''ప్రతి సినిమాతో మనలో ఎంతోకొంత మార్పు వస్తుందని నా ఉద్దేశం. వాటితో కొన్ని కొత్త అలవాట్లు నేర్చుకుంటాం. సినిమాల్లోకి వచ్చాక నా ప్రవర్తనలో చాలా మార్పులొచ్చాయి'' అని పూజా హెగ్డే అంటోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బోయపాటితో సినిమాలు చేసేందుకు పోటీపడుతున్న చిరంజీవి, బాలయ్య