Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గూగుల్ ప్రకటనతో టాలీవుడ్ ఫ్యాన్స్ వార్.. టాప్‌లో అల్లు అర్జున్.. మహేష్.. పవన్‌ మాత్రం?

సోషల్ మీడియా వ్యవహారంతో టాలీవుడ్‌లో చిచ్చు మొదలైంది. ప్రస్తుతం ఫ్యాన్స్ తమ హీరో సినిమాలు బాక్సాఫీస్ రికార్డుల కంటే యూట్యూబ్, సోషల్ మీడియా రికార్డులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్ల

Advertiesment
Google Search Top Tollywood Hero 2016
, సోమవారం, 19 డిశెంబరు 2016 (09:18 IST)
సోషల్ మీడియా వ్యవహారంతో టాలీవుడ్‌లో చిచ్చు మొదలైంది. ప్రస్తుతం ఫ్యాన్స్ తమ హీరో సినిమాలు బాక్సాఫీస్ రికార్డుల కంటే యూట్యూబ్, సోషల్ మీడియా రికార్డులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గూగుల్ ప్రకటన టాలీవుడ్‌లో చిచ్చు పెట్టింది. గూగుల్ ప్రతి ఏటా ప్రకటించే ‘మోస్ట్ సెర్చ్‌డ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’ లిస్టులో టాలీవుడ్‌కు సంబంధించి తమ హీరో టాప్ అంటే తమ హీరో టాప్ అంటూ కొట్టుకుంటున్నారు.

2016లో గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన హీరోల లిస్ట్‌ను గూగుల్ ప్రకటించడంతో ఈ గొడవ మొదలైంది. అయితే ఈ లిస్టులో అల్లు అర్జున్ టాప్‌లో ఉన్నాడంటూ ఒక ప్రకటన రాగా.. జూనియర్ టాప్‌లో ఉన్నాడంటూ మరో ప్రకటన వెలువడింది. దీంతో మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్పంటూ ఫ్యాన్స్ పోస్టింగులు పెడుతున్నారు. 
 
అయితే ఈ రెండు ప్రకటనలలో పవర్ స్టార్ పేరు టాప్‌లో లేకపోవడంతో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. గూగుల్‌లో పవన్ గురించి సర్చ్ చేస్తున్నప్పుడు కొంతమంది పవన్ మరికొంతమంది పవర్ స్టార్ ఇంకొంతమంది పవన్ కళ్యాణ్ అని సెర్చ్ చేయడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని, లేకుంటే గూగుల్ సెర్చ్‌లో టాప్ పొజిషన్ పవన్‌కు కాకుండా మరి ఏ టాప్ హీరోకి రాదు అని వాదిస్తున్నారు. అయితే 2016 ముగింపుకు రావడానికి మరొక 12 రోజులు కాలం ఉండటంతో ఈలోగా ఈ పోజిషన్స్ మారిపోతాయని పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మగాళ్ళపై జయలలిత ద్వేషం పెంచుకోవడానికి వారిద్దరే కారణమా?