Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"tarak" ముఖ్యమంత్రి అవుతాడా? గూగుల్ ఇలా ప్రచారం చేస్తుందేమిటి.. నిజమేనా?

''జనతా గ్యారేజ్'' సినిమా షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్న ఎన్టీఆర్‌పై సెర్చ్ ఇంజిన్ గూగుల్ వెరైటీగా ప్రచారం చేస్తోంది. జనతా గ్యారేజ్ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిన నేపథ్యంలో ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రిగా ప్రచార

Advertiesment
Tarak means chief minister
, మంగళవారం, 19 జులై 2016 (14:26 IST)
''జనతా గ్యారేజ్'' సినిమా షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్న ఎన్టీఆర్‌పై సెర్చ్ ఇంజిన్ గూగుల్ వెరైటీగా ప్రచారం చేస్తోంది. జనతా గ్యారేజ్ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిన నేపథ్యంలో ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రిగా ప్రచారం చేస్తోంది. ఇంతకీ అసలు సంగతేంటంటే? గూగుల్‌కు ఉన్న ఫీచర్స్‌లో గూగుల్ ట్రాన్స్‌లేట్ ఒకటి.. ఇందులో మనకు కావాల్సిన పదాన్ని టైప్ చేస్తే దానికి అర్థం ఏ భాషలో కావాలన్నా ఆ భాషల్లో చూపిస్తుంది.
 
అలాగే ''tarak'' అని ఇంగ్లీషులో టైప్ చేసి తెలుగులో అర్థం వెతికితే ''ముఖ్యమంత్రి'' అని చూపిస్తోంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అంతేగాకుండా తారక్ సీఎం అవుతాడని అభిమానులు కూడా మరోవైపు ప్రచారం చేస్తున్నారు. తెలుగుదేశం వ్యవస్థాపకుడు తారక రామారావు పోలికలు ఎక్కువగా ఉన్న ఈ మనవడు ముందు ముందు సీఎం అవుతాడనే సూచనతో గూగుల్ ఇలా జోస్యం చెప్తుందా అని అందరూ అనుకుంటున్నారు. 
 
కాగా జనతా గ్యారేజ్ షూటింగ్ పూర్తైంది. ఓ పాటను కేరళ అందాల మధ్య షూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అలాగే మరో పాట కోసం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో భారీ సెట్ వేసి షూట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనతా గ్యారేజ్ టీజర్ ఇప్పటికే తక్కువ టైమ్‌లో ఎక్కువ వ్యూవ్స్ సాధించిన టీజర్‌గా రికార్డు సాధించింది. ఈ విషయంలో కబాలి టీజర్ తర్వాత గ్యారేజ్ టీజర్ రెండో స్థానంలో ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆయన... నాగార్జునను పెళ్లి చేసుకుంటావా? అని అడిగారు : సుమలత