Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గూగుల్ సెర్చ్‌లోనూ జక్కన్న బాహుబలి: మోస్ట్ సెర్చ్ స్టార్లలో సన్నీకే టాప్ ప్లేస్!

గూగుల్ సెర్చ్‌లోనూ జక్కన్న బాహుబలి: మోస్ట్ సెర్చ్ స్టార్లలో సన్నీకే టాప్ ప్లేస్!
, శుక్రవారం, 25 డిశెంబరు 2015 (11:58 IST)
ప్రముఖ దర్శకుడు రాజమౌళి రూపొందించిన ప్రతిష్టాత్మక బాహుబలి సినిమా గూగుల్ సెర్చ్‌లోనూ అదరగొట్టేసింది. తెలుగు చిత్రసీమ రికార్డులతో పాటు భారతీయ చలనచిత్ర రికార్డులను చెరిపేసిన బాహుబలి.. గడిచిన ఏడాది కాలంలో భారత్ లో అత్యధిక మంది గూగుల్‌లో సెర్చ్ చేసిన సినిమాల్లో రెండో స్థానంలో నిలిచింది.

ఇక ‘బాహుబలి’ కంటే ముందు ఐసీసీ వరల్డ్ కప్-2015 ఒక్కటి మాత్రమే ఉంది. బాలీవుడ్ హిట్ చిత్రాలు భజరంగీ భాయ్ జాన్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, ఏబీసీడీ-2, ఐ చిత్రాలన్నీ బాహుబలి తర్వాతి స్థానాలతోనే సరిపెట్టుకున్నాయి.
 
ఇక టాప్ మోస్ట్ సెర్చ్ స్టార్లలో అందరినీ వెనక్కు నెట్టేస్తూ సన్నీలియోన్ అగ్రస్థానంలో నిలిచింది. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్, దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణే తదితరులు ఆ తర్వాతి స్థానాలను కైవసం చేసుకున్నారు.

క్రీడాకారుల్లో టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలవగా... ఆ తర్వాతి స్థానాల్లో మెస్సీ, సచిన్, కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu