Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విద్యావ్య‌స్థపై "గాడ్సే` షూటింగ్ ప్రారంభం

Advertiesment
విద్యావ్య‌స్థపై
, గురువారం, 11 ఫిబ్రవరి 2021 (15:23 IST)
Godse opening
'జ్యోతిలక్ష్మీ, బ్లఫ్ మాస్టర్' చిత్రాలతో హీరోగా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్ హీరోగా, ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా సికే స్క్రీన్స్ పతాకంపై గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వంలో అభిరుచిగల నిర్మాత సి. కళ్యాణ్ నిర్మిస్తున్న చిత్రం "గాడ్సే". ఎడ్యుకేషన్స్ బాక్డ్రాప్ లో రూపొందుతోన్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 11న హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభమైంది.. ఈ సందర్బంగా ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత సి.కళ్యాణ్, ప్రముఖ నిర్మాత కేయస్ రామారావు,  హీరో సత్యదేవ్, హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ, దర్శకుడు గోపీ గణేష్ పట్టాభి, సంగీత దర్శకుడు సునీల్ కాశ్యప్, నటులు ప్రకాష్ నాగ్, అశోక్ కుమార్ పాల్గొన్నారు..
 
నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ.. 'కరోనా తర్వాత మా 'గాడ్సే' సినిమా స్టార్ట్ కావడం చాలా హ్యాపీగా ఉంది. ఇది మా బ్యానర్లో నిర్మిస్తోన్న 80వ చిత్రం. ఇదే ఉత్సాహంతో తొందరలోనే 100 వంద సినిమాలు కంప్లీట్ చేస్తాం.. అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సత్యదేవ్ హీరోగా 'జ్యోతిలక్ష్మీ' సినిమా తీశాను.. చాలా మంచిపేరు వచ్చింది. అందులో సత్య గొప్పగా పెర్ఫార్మెన్స్ చేశాడు.

ఇప్పుడు సికే స్క్రీన్స్ బ్యానర్లో సత్యదేవ్ తో గాడ్సే చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. గోపి ఫెంటాస్టిక్ సబ్జెక్ట్ చెప్పాడు.. నాకు బాగా నచ్చింది. అంత మంచి కథతో గోపీ గణేష్ పట్టాభి నాకు సినిమా చేస్తున్నందుకు లక్కీగా భావిస్తున్నాను. ఈ విషయంలో సత్య నాకు ఫుల్ పేవర్ చేసినందుకు సత్యకి థాంక్స్. ప్రతీ తల్లీతండ్రులు, యువకులు ఆలోచించేవిధంగా ఎడ్యుకేషన్స్ బాక్డ్రాప్ లో "గాడ్సే" చిత్రాన్ని గొప్పగా తెరకెక్కిస్తున్నాం. 

ట్రెమండస్ ఐడియా తో ప్రతీ ఒక్కరూ డిస్కస్ చేసుకునేలా ఈ సినిమాని అద్భుతంగా గోపీ తీయబోతున్నాడు. గాడ్సే అంటే ఒక దుర్మార్గుడి పేరు.. అది మంచి పేరా.. దుర్మార్గమైన పేరా అనేది సినిమాలో ఇంట్రెస్టింగా చూపించబోతున్నాం.. ప్రాణం పెట్టి  చేసే టెక్నీషియన్స్ ఈ సినిమాకి వర్క్ చేస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మీ ఈ సినిమాతో తెలుగులో పరిచయం అవుతుంది. మా బ్యానర్లో నటించిన హీరోయిన్స్ అంతా టాప్ పొజిషన్స్ లో వున్నారు.. అలాగే ఈ సినిమాతో ఐశ్వర్య లక్ష్మీ మంచి స్థాయికి వెళుతుంది. సునీల్ కశ్యప్ నాకు గుర్తుండిపోయే పాటల్ని జ్యోతిలక్ష్మి లో ఇచ్చాడు.. గాడ్సే కి కూడా అలాంటి మ్యూజిక్ చేయబోతున్నాడు.  ఈ రోజు నుండి సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ కంప్లీట్ చేసి.. జూన్, జులై నెలలో సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.. అన్నారు.
 
దర్శకుడు గోపీ గణేష్ పట్టాభి మాట్లాడుతూ.. ' సత్యతో బ్లఫ్ మాస్టర్ సినిమా చేశాను. అది మాకు చాలా మంచి పేరు తెచ్చింది. మళ్ళీ అంతకంటే గొప్ప సినిమా చేయాలి అనుకుంటుండగా నాకు ఒక ఐడియా వచ్చింది. అది సత్యకు చెప్పగానే.. మనం ఈ సినిమా చేస్తున్నాం అన్నాడు. అలా సబ్జెక్ట్ డెవలప్ చేసి కళ్యాణ్ గారికి చెప్పాను. ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నాకు చాలా వ్యాల్యూబుల్ సజేషన్స్ ఇచ్చారు. అందరూ గర్వపడే సినిమా అవుతుంది అని కళ్యాణ్ గారు చెప్పారు.. అది నాకు ఫుల్ ఎనర్జీనిచ్చింది.

సమాజంలో ప్రతీ ఎడ్యుకేటెడ్ పర్సన్ కి ఒక ఇన్నర్ ఫీలింగ్ వాయిస్ అనేది ఉంటుంది.. కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళు అనుకున్నది మాట్లాడలేక, ఎవరికీ చెప్పలేక పోతున్నారు.. అది మేము గాడ్సే లౌడర్ వాయిస్ ద్వారా చూపిస్తున్నాం. ప్రతీ కంట్రీలో ఉన్న, జరుగుతున్న పాయింట్ టచ్ చేసి బిగ్ స్క్రీన్ మీద తెరకెక్కిస్తున్నాం. సినిమాలో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకూ హీరోకి అపోసిట్ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి.. అందుకోసం చాలా మంది హీరోయిన్స్ ని చూశాం.. ఫైనల్ గా ఐశ్వర్య లక్ష్మిని కన్ఫర్మ్ చేశాం.

తెలుగులో చాలా ఆఫర్స్ వచ్చినా కూడా తను చేయలేదు. కథ చెప్పగానే బాగా ఇంప్రెస్ అయి వెంటనే నేను ఈ సినిమా చేస్తాను. నాకు తెలుగులో పర్ఫెక్ట్ ఎంట్రీ ఫిల్మ్ ఇది అని చేస్తోంది. అప్పుడు నాకు ఒక ధైర్యం, కాన్ఫిడెన్స్ వచ్చింది. సునీల్ కశ్యప్ తో ఇది 3వ చిత్రం. నా ఆలోచనలకి తగ్గట్లుగా అర్థం చేసుకొని ట్యూన్స్ కంపోజ్ చేస్తాడు. సురేష్ సారంగి టెక్నికల్ గా, విజువల్స్ పరంగా బ్యూటిఫుల్ ఫోటోగ్రఫీ చేస్తున్నాడు. ఈరోజునుండి  సింగిల్ షెడ్యూల్ లో సినిమా పూర్తిచేస్తాం.. రిలీజ్ కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నాం.. అన్నారు.
 
హీరో సత్యదేవ్ మాట్లాడుతూ... ' నా లైఫ్ లో జ్యోతిలక్ష్మీ చాలా ముఖ్యమైన సినిమా.. బ్లఫ్ మాస్టర్ కూడా ముఖ్యమైన సినిమా. బ్లఫ్ మాస్టర్ ని ప్రేక్షకులు చాలా బాగా ఆదరించారు.. మళ్ళీ బ్లఫ్ మాస్టర్ 2 ఎప్పుడు చేస్తారు అని అడుగుతున్నారు.. దానికి రెండింతలు గొప్పగా వుండే సినిమా "గాడ్సే". హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ తో చెపుతున్నాను. పొట్టోడు గట్టోడు అనే సామెతకు.. నిలువెత్తు నిదర్శనమ్ డైరెక్టర్ గోపీ గణేష్ పట్టాభి.

అద్భుతమైన కథతో గాడ్సే సినిమాని తీయబోతున్నారు.  మా కాంబినేషన్ లో ఇది సెకండ్ ఫిల్మ్. ఐశ్వర్య గ్రేట్ పెర్ఫార్మర్. తనకి ఇది తెలుగులో బెస్ట్ ఫిల్మ్ అవుతుంది. కళ్యాణ్ గారితో గాడ్సే సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఆయన సపోర్ట్, ఎంకరేజ్ మెంట్ నెక్స్ట్ లెవల్ లో చేస్తున్నారు. సునీల్ కశ్యప్ వన్ ఆఫ్ ది బెస్ట్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. ఆల్రెడీ తను ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాకి సూపర్బ్ ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నాడు. మా కాంబినేషన్లో బిగ్ హిట్ కొట్టబోతున్నాం.. అన్నారు.
 
హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ మాట్లాడుతూ.. ' తెలుగులో మంచి సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన కళ్యాణ్ గారికి, గోపీ గణేష్ గారికి నా థాంక్స్. అందరి బ్లెస్సింగ్స్, సపోర్ట్ మా సినిమాకి కావాలి.. అన్నారు.
 
సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ మాట్లాడుతూ... ' సత్య, గోపీ మా కాంబినేషన్లో వచ్చిన 'బ్లఫ్ మాస్టర్' మాకు బిగ్ బ్రేక్ నిచ్చింది. ఈ సినిమా మా కాంబినేషన్లో హ్యాట్రిక్ ఫిల్మ్ అవుతుంది. హార్డ్ వర్క్ చేసి ఈ సినిమాకి ది బెస్ట్ మ్యూజిక్ ఇస్తాను. ఈ అవకాశం ఇచ్చిన కళ్యాణ్ గారికి నా థాంక్స్.. అన్నారు.
 
సత్యదేవ్, ఐశ్వర్య లక్ష్మీ, సాయికుమార్, సిజ్జు మీనన్, బ్రహ్మాజీ, ప్రకాష్ నాగ్, అశోక్ కుమార్, కోటేశ్వరరావు తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి బ్యానర్; సికే స్క్రీన్స్,  మ్యూజిక్; సునీల్ కశ్యప్, కెమెరా; సురేష్ సారంగ్, ఆర్ట్; బ్రహ్మ కడలి, ఫైట్స్; నభా, స్టోరీ సపోర్ట్; అర్జున్ తడేలు, కో-డైరెక్టర్; విష్ణు శ్రీనివాస్, కో-ప్రొడ్యూసర్; సివి రావ్, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం; గోపీ గణేష్ పట్టాభి, నిర్మాత; సి.కళ్యాణ్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బజార్ రౌడీగా సంపూ.. ఐదు పాత్రలతో అలరించనున్న సంపూ..!