Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారీ వసూళ్లను రాబట్టిన గాడ్ ఫాదర్.. ఒక్క రోజే రూ.38 కోట్లు

Advertiesment
God Father
, గురువారం, 6 అక్టోబరు 2022 (14:02 IST)
God Father
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా సినిమా గాడ్ ఫాదర్ ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. ఎన్వీ ప్రసాద్ - ఆర్ బి చౌదరి నిర్మించిన ఈ సినిమా తొలి రోజునే ఈ సినిమా 38 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టడం విశేషం. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ అందుకు సంబంధించిన పోస్టర్‌ను వదిలారు. 
 
ఇది చిరంజీవి చేసిన రెగ్యులర్ సినిమా కాదని ఆడియన్స్‌ను ముందుగానే ప్రిపేర్ చేయడం వలన, వాళ్లంతా కేవలం కంటెంట్‌పై ఆసక్తితోనే థియేటర్స్‌కి రావడంతో వాళ్లను ఈ సినిమా ఆకట్టుకుంది. 
 
ఇక తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ఆరో ప్రాణమని చిరంజీవినే చెప్పారు. మలయాళంలో కొంతకాలం క్రితం రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టిన 'లూసిఫర్' సినిమాకి గాడ్ ఫాదర్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్‌.ఆర్‌.ఆర్‌. గురించి మ‌రోసారి రాజ‌మౌళి ఏం చెప్పాడంటే!