మెగాహీరో వరుణ్ తేజ్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా 'గని'. బాక్సింగ్ క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాతో కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది. తాజాగా సినిమా నుంచి ఫస్ట్ పంచ్‌ను విడుదల చేశారు.
బాక్సింగ్ రింగ్‌లో ఉన్న వరుణ్ తేజ్ లుక్ ను రివీల్ చేస్తూ.. ఆయన ఇచ్చిన పంచ్‌తో చిన్న వీడియో కట్ చేశారు. ఈ పంచ్ మాములుగా లేదు. సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఓ రేంజ్‌లో ఉండబోతున్నాయని తెలుస్తోంది. దీని కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లార్నెల్ స్టోవల్‌ను రంగంలోకి దించారు.
ఈ సినిమాలో వరుణ్ తేజ్ ప్రొఫెషనల్ బాక్సర్‌గా కనిపించడం కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాడు. జిమ్‌లో గంటల తరబడి వర్కవుట్ చేసి పెర్ఫెక్ట్ ఫిజిక్‌ను మెయింటైన్ చేస్తూ వచ్చాడు. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలానే ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతిబాబు, నవీన్ చంద్ర కీలకపాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ-సిద్దు ముద్ద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ముందుగా జూలై నెలాఖరున విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు డిసెంబర్ 3న విడుదల చేయబోతున్నట్లు ఫస్ట్ పంచ్ వీడియోతో అధికారికంగా అనౌన్స్ చేశారు.