Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అవి ఉంటే తప్ప జనాలు చూడరా...

రాను రానూ చలన చిత్ర పరిశ్రమ కొత్త పుంతలు తొక్కుతోందనే కీర్తి ఎంత గడిస్తోందో ప్రేక్షకుల స్థాయిని అంత తక్కువగా అంచనా వేస్తూ, వారిని మరీ దారుణంగా అవమానిస్తున్నారనేది కూడా అంతే నిజమనేది కొందరి విమర్శకుల వ

అవి ఉంటే తప్ప జనాలు చూడరా...
, బుధవారం, 26 ఏప్రియల్ 2017 (11:58 IST)
రాను రానూ చలన చిత్ర పరిశ్రమ కొత్త పుంతలు తొక్కుతోందనే కీర్తి ఎంత గడిస్తోందో ప్రేక్షకుల స్థాయిని అంత తక్కువగా అంచనా వేస్తూ, వారిని మరీ దారుణంగా అవమానిస్తున్నారనేది కూడా అంతే నిజమనేది కొందరి విమర్శకుల వాదన. తెలుగు సినీ పరిశ్రమను ప్రపంచ స్థాయికి తీసుకెళుతున్నారంటూ అమరశిల్పి జక్కన్నగా పేరొందిన రాజమౌళి కూడా భారీ బడ్జెట్ పెట్టి భారీ సినిమా తీసినప్పుడు, జనాలు ఆదరిస్తారో లేదోననే భయంతో, ద్వంద్వార్ధం ధ్వనించే పాటలు, హీరోయిన్‌ల అంగాంగ ప్రదర్శనలు, ఐటెం సాంగుల మీద ఆధారపడటం కాస్త విడ్డూరమే అనిపిస్తోంది.
 
పూరీ జగన్నాధ్ సినిమా (నేనింతే)లో చెప్పినట్లు, "శంకరాభరణం వంటి సినిమాలు ఈ జనాలు చూడకుండానే హిట్లు కాలేదుగా.. తీసే వాళ్లు తీస్తున్నారు కాబట్టి మేము చూస్తున్నాము కానీ, మాకు టేస్ట్ లేక కాదు" అని జనాలు తిరగబడే రోజులు ఎంతో దూరంలో లేవు అని నొక్కి వక్కాణిస్తున్నారు. 
 
ఇక రానున్న బాహుబలి-2లో ఎన్ని మాసాలాలు దట్టించారో, దానినైనా ప్రేక్షకులు కుటుంబాలతో పాటు కూర్చొని చూడగలరా, లేదా అనే అనుమానం ఎటు తిరిగీ రెండు రోజులలో తేలిపోనుండగా, ఇకమీదటైనా దర్శకనిర్మాతలు కాస్త కుటుంబాలను దృష్టిలో పెట్టుకోవలసిందిగా ప్రేక్షక లోకం మనవి చేస్తున్నారు. సకుటుంబ కథా చిత్రమంటూ ఒకటి ఉండేది అని జనాలు చెప్పుకునే రోజుల్లో బ్రతుకుతున్న మనం రేపు మన తర్వాతి తరాలకు వాటి ఉనికిని నిలపగలమా లేమా అన్న మీమాంస జనాల్లో అలాగే ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశం గర్వించదగ్గ సినిమాలు తీసిన దర్శకుడు కె.విశ్వనాథ్ గారు: పవన్ కళ్యాణ్