బాలీవుడ్ షారూఖ్ ఖాన్ తన కళ్లు గురించి గొప్పలు చెప్పుకున్నాడు. తన కళ్లంటే అమ్మాయిలు పడి చచ్చిపోతారని షారూఖ్ తెలిపాడు. తన కళ్లు బెడ్ రూమ్ కళ్లు. సెక్సీగా ఉంటాయని.. తన కళ్లెప్పుడు అలసిపోయినట్లు కనిపించవన్నారు. అందుకే అమ్మాయిలు తానో లుక్కేస్తే చచ్చిపోతారని షారూఖ్ అన్నాడు. ఫ్యాన్స్‌తో లైవ్ ఛాటింగ్‍లో పాల్గొన్న సందర్భంగా షారూఖ్ ఖాన్ పై విధంగా వ్యాఖ్యానించాడు.
నిజానికి షారూఖ్ ఖాన్ మంచి పర్సనాలిటీ ఉన్న వ్యక్తి కాదని కొందరు అభిప్రాయపడితే.. షారూఖ్ ఖాన్ అమ్మాయిలకు డ్రీమ్ బాయ్ అంటూ మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక అభిమానులు అడిగే ప్రశ్నలకు కింగ్ ఖాన్ ఓపిగ్గా సమాధానమిచ్చాడు. ఈ సందర్భంగా తన కళ్లల్లో ఏదో మాయ ఉందని, అవే ప్లస్ పాయింట్‌గా మారాయని వివరించాడు.
ఇక తన ఫ్యామిలీ గురించి, వ్యక్తిత్వం గురించి అభిమానులు అడిగిన ప్రశ్నలకు షారూఖ్ సమాధానమిచ్చాడు. తన చిన్న కుమారుడు అబ్ రామ్‌తో కలిసి సినిమాలు చూడటం అంటే తనకెంతో ఇష్టమన్నాడు. ఇద్దరూ కలిసి తన 'మినియన్స్' మూవీని 200 సార్లకు పైగా చూశారని వెల్లడించారు.