Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'మెట్రో' ట్రైల‌ర్‌ను ఆవిష్కరించిన గౌత‌మ్ మీన‌న్‌.. సురేష్ కొండేటికి బెస్ట్ విషెస్

త‌మిళ చిత్రం 'మెట్రో' ఇప్పుడు తెలుగులోనూ అనువాద‌మై రిలీజ‌వుతోంది. `ప్రేమిస్తే`, `జ‌ర్నీ`, `షాపింగ్‌మాల్‌`, `పిజ్జా` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ను తెలుగువారికి అందించిన సురేష్ కొండేటి స‌మ‌ర్ప‌ణ‌లో ఆర్‌-4 ఎం

Advertiesment
'మెట్రో' ట్రైల‌ర్‌ను ఆవిష్కరించిన గౌత‌మ్ మీన‌న్‌.. సురేష్ కొండేటికి బెస్ట్ విషెస్
, బుధవారం, 16 నవంబరు 2016 (16:49 IST)
త‌మిళ చిత్రం 'మెట్రో' ఇప్పుడు తెలుగులోనూ అనువాద‌మై రిలీజ‌వుతోంది. `ప్రేమిస్తే`, `జ‌ర్నీ`, `షాపింగ్‌మాల్‌`, `పిజ్జా` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ను తెలుగువారికి అందించిన సురేష్ కొండేటి స‌మ‌ర్ప‌ణ‌లో ఆర్‌-4 ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత ర‌జ‌ని తాళ్లూరి ఈ చిత్రాన్ని తెలుగువారికి అందిస్తున్నారు. హైద‌రాబాద్‌లో `మోట్రో` తెలుగు ట్రైల‌ర్‌ని గౌతమ్ మీనన్ లాంచ్ చేశారు. 
 
ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ 'మెట్రో ఫెంటాస్టిక్ మూవీ. త‌మిళంలో రిలీజైన ఈ చిత్రం పెద్ద విజ‌యం సాధించింది. తెలుగులో అంత‌కుమించిన విజ‌యం సాధిస్తుంది. చైన్ స్నాచింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో తెర‌కెక్కిన న్యూ ఏజ్ సినిమా. న‌వ‌త‌రానికి బాగా న‌చ్చుతుంది. ఈ సినిమాకి ప‌నిచేసిన టీమ్‌కి మంచి పేరొచ్చింది. తెలుగులో రిలీజ్ చేస్తున్న సురేష్ కొండేటి - ర‌జ‌ినీ తాళ్లూరికి నా బెస్ట్ విషెస్' అన్నారు. 
 
నిర్మాత ర‌జినీ తాళ్లూరి మాట్లాడుతూ.. 'డ‌బ్బింగ్ స‌హా అన్ని ప‌నులు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వ‌ర‌లో రిలీజ్‌కి వ‌స్తోంది. గౌత‌మ్ మీన‌న్ అంత‌టి స్టార్ డైరెక్ట‌ర్ మా సినిమా ట్రైల‌ర్ లాంచ్ చేసి, సినిమా తెలుగువారికి న‌చ్చుతుంద‌ని ప్ర‌శంసించ‌డం సంతోషాన్నిచ్చింది. ఈ సినిమా పెద్ద విజ‌యం సాధిస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది' అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

20న రజినీకాంత్ '2.O' ఫస్ట్ లుక్...