నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'. ఈ చిత్రం షూటింగ్ ఈనెల 9 నుంచి మొరాకోలో జరగనుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రం బాలకృష్ణ సినిమా కెరీర్లోనే మొట్ట మొదటిసారిగా రూ.50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనుంది. మూడువారాలపాటు ఈ ఫిల్మ్‌కి సంబంధించిన హైఓల్టేజ్ వార్ సీన్స్‌ని తెరకెక్కించాలని యూనిట్ సభ్యులు అనుకుంటున్నారట.
అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో రూ.8 కోట్ల వ్యయంతో ఒక భారీ ఫైట్‌ను తెరకెక్కించాలని దర్శకుడు భావిస్తున్నాడట. ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికే మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఈ ఫైట్ సీన్ కోసం 4 బృందాలు, 800 మంది జూనియర్ ఆర్టిస్టులు, అనేక ఆయుధాలు, వివిధ రకాలైన బట్టలు వంటివి ఈ భారీ వార్ సీన్లో ఎక్కువ మొత్తంలో ఉపయోగించనున్నారట. ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే యేడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకులు భావిస్తున్నారట.