Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హిస్టరీ కంటే.. వార్ డోస్ ఎక్కువైన 'గౌతమిపుత్ర శాతకర్ణి'... సినిమా అంటే యుద్ధమేనా?

సంక్రాంతికి సరికొత్త శోభను తీసుకొస్తూ సందడి చేసిన రెండు అగ్ర సినిమాలు బాక్సాఫీసును బద్దలు కొట్టాయనడంలో సందేహం లేదు. రైతు, నీరు వంటి సామాజిక సమస్యలకు పట్టం గట్టిన సినిమా "ఖైదీ నంబర్ 150" కాగా, 2 వేల ఏళ

Advertiesment
Gautamiputra Satakarni negetive points
, శుక్రవారం, 13 జనవరి 2017 (06:40 IST)
సంక్రాంతికి సరికొత్త శోభను తీసుకొస్తూ సందడి చేసిన రెండు అగ్ర సినిమాలు బాక్సాఫీసును బద్దలు కొట్టాయనడంలో సందేహం లేదు. రైతు, నీరు వంటి సామాజిక సమస్యలకు పట్టం గట్టిన సినిమా "ఖైదీ నంబర్ 150" కాగా, 2 వేల ఏళ్లుగా మరుగున పడిన శాతవాహనుల చరిత్రను వెలికి తీసి తెలుగు ప్రజల భావోద్వేగాలను రంజింపజేసిన సినిమాగా "గౌతమిపుత్ర శాతకర్ణి" మిగిలిపోతుంది.
 
తెలుగు రాష్ట్రానికి చెందిన వాస్తవిక కథతో ముందుకొచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణి... తెలుగు వారు గర్వంగా చెప్పుకోవాల్సిన ఘన చరిత్రకు అద్భుత దృశ్యరూపం అంటూ మీడియా, అభిమానులు, సగటు ప్రేక్షకులూ బాలయ్య సినిమాకు దాసోహమైపోయారు. కానీ అలాంటి ఛాయలు ఎక్కడా కూడా ఈ చిత్రంలో కనిపించక పోవడం గమనార్హం. 
 
తెలుగు వారి పురాతన చరిత్రకు, శాతవాహన వైభవానికి, అమరావతి రాజసానికి పట్టం గడతామంటూ చెప్పుకుని ముందుకొచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణిలో చరిత్ర పక్కకు వెళ్లి యుద్ధ కండూతికి, యుద్ధ సన్నివేశాలకు ప్రాముఖ్యం ఇవ్వడం ఆ చిత్రంలో ప్రధాన లోపంగా సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
 
నిజానికి శాతకర్ణి గురించిన పూర్తి వివరాలు వెల్లడించే ప్రయత్నం ఈ చిత్రంలో చేయలేదు. 'గౌతమిపుత్ర శాతకర్ణి' పరిపాలనా దక్షతా, వ్యవహార శైలి, ఆలోచనా విధానాలు, చేపట్టిన సంస్కరణలు వగైరా విషయాలపై క్రిష్‌ దృష్టి పెట్టలేదు. క్రిష్ ఎంచుకున్న రాజప్రాసాదాలు, యుద్ధ రంగాలు.. అలనాటి శాతకర్ణి వైభవాన్ని కళ్లకు కట్టాయి. ప్రతీ ఫ్రేమ్‌లోనూ శాతవాహనుల రాజసం కనిపించేలా తెరకెక్కించడమే శాతకర్ణి సక్సెస్‌కు మూల కారణం.
 
కేవలం 2 గంటల 15 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రంలో డ్రామాకి కనీసం పావు వంతు స్కోప్‌ కూడా ఇవ్వకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది.. సినిమాను పూర్తిగా యుద్ధ సన్నివేశాలతో నింపేశారు. ఇందులో శాతకర్ణి చేసిన యుద్ధాల్లో మూడింటిని కవర్‌ చేశారు. అందులో మొదటిది కేవలం పాత్ర పరిచయానికి మాత్రం వాడుకున్న యుద్ధ సన్నివేశం కాగా, రెండోది సుదీర్ఘంగా సాగుతూ దాదాపు ముప్పావు వంతు ప్రథమార్థాన్ని అదే కవర్‌ చేసేస్తుంది. చిత్రం ద్వితియార్థంలో సింహభాగం ఈ యుద్ధ సన్నివేశాలే ఉంటాయి.
 
తెలుగువారు గర్వించే ధీరత్వాన్ని ప్రదర్శించిన శాతకర్ణి ధైర్య సాహసాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి కానీ, క్రిష్‌లాంటి దర్శకుడు తీసిన చిత్రంలో కేవలం యుద్ధాలు మినహా ఎక్కువ వివరాలు లేకపోవడం నిరాశ పరుస్తుంది. శాతకర్ణి గురించిన పూర్తి అవగాహన ఇవ్వడంలో ఈ చిత్రం విజయవంతం కాలేదనే ఘంటాపథంగా చెప్పవచ్చు. 
 
యుద్ధ సన్నివేశాలు జనాలను మంత్రముగ్ధులు చేస్తాయన్న విషయాన్ని బాహుబలి చిత్రం తొలిసారిగా వెండితెరపై ప్రదర్శించింది. శాతకర్ణి సినిమా నిర్మాణంలో కూడా బాహుబలి దర్శకుడు రాజమౌళిని ఒక సందర్భంలో కలుసుకున్న క్రిష్ యుద్ధ సన్నివేశాలతోటే సినిమా మొత్తాన్ని నడిపించవచ్చన్న పాఠం నేర్చుకున్నాడేమో.. అందుకే సినిమా మొత్తంలో గ్రాండియర్ అని చెప్పుకుంటున్న భారీతనం యుద్ధ సన్నివేశాల్లోనే కనిపిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మరో భక్తిరస చిత్రంలో నాగార్జున? 'రాజుగారి గది' సీక్వెల్ తర్వాత షూటింగ్ స్టార్ట్!