తిరుపతిలో "గౌతమిపుత్ర శాతకర్ణి" ఆడియో రిలీజ్.. ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే...
టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ నటించిన వందో చిత్రం "గౌతమిపుత్ర శాతకర్ణి" ఆడియో విడుదల కార్యక్రమంలో సోమవారం తిరుపతిలో జరుగనుంది. స్థానిక నెహ్రూ మున్సిపల్ పాఠశాల మైదానంలో ఈ ఆడియో విడుదల కార్యక్రమాన
టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ నటించిన వందో చిత్రం "గౌతమిపుత్ర శాతకర్ణి" ఆడియో విడుదల కార్యక్రమంలో సోమవారం తిరుపతిలో జరుగనుంది. స్థానిక నెహ్రూ మున్సిపల్ పాఠశాల మైదానంలో ఈ ఆడియో విడుదల కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా శనివారం తిరుపతి ఎమ్మెల్యే సుగుణతో కలిసి మైదానాన్ని చిత్ర సమర్పకుడు బిబో శ్రీనివాస్, నిర్మాత రాజీవ్‌రెడ్డి పరిశీలించి, ఏర్పాట్లపై చర్చించారు. ఆడియో వేడుకకు ఎంతమంది వస్తారు? ఎంట్రీలెలా? వీఐపీ బ్యారికేడ్లు, స్టేజ్ నిర్మాణం వంటివాటిపై ఆడియో వేడుక నిర్వహిస్తున్న జై మీడియా ఈవెంట్ ప్రతినిధి నరేంద్రరాజుతో సమీక్షించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా 800 థియేటర్లలో చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నామన్నారు.
చరిత్రలో నిలిచిపోయేలా సినిమా ఉంటుందన్నారు. ఆడియో వేడుకకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సీనియర్‌నటి హేమమాలినితో పాటు చిత్ర పరిశ్రమలోని నటీనటులు పెద్దఎత్తున హాజరవుతారన్నారు. అందరూ ఆహ్వానితులేనని.. వీవీఐపీలకు మాత్రమే ఎంట్రీ పాసులు ఇస్తున్నామన్నారు.
ఆదివారం సాయంత్రానికి ఏర్పాట్లు పూర్తవుతాయన్నారు. సోమవారం సాయంత్రం తిరుపతిలోని ఓ హోటల్ వద్ద నుంచి 500 కార్లు, 1000 ద్విచక్ర వాహనాలతో బాలకృష్ణ భారీ ర్యాలీగా ఆడియో వేదిక వద్దకు చేరుకుంటారని ఆయన తెలిపారు. కాగా, ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను ఇటీవల జగిత్యాల జిల్లాలో విడుదల చేసిన విషయం తెల్సిందే.