Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులందరికి కాంటినెంటిల్ హాస్పిటల్ లో ఉచిత హెల్త్ చెకప్

Advertiesment
Vishnu Manchu, Madala Ravi, Shiva Balaji, Gurunatha Reddy
, సోమవారం, 6 మార్చి 2023 (08:09 IST)
Vishnu Manchu, Madala Ravi, Shiva Balaji, Gurunatha Reddy
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) కాంటినెంటల్ హాస్పిటల్స్ సహాయంతో మా సభ్యులందరికి పూర్తి మాస్టర్ హెల్త్ చెకప్ నిర్వించారు. మా సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్క సభ్యుడికి ఈ హెల్త్ చెకప్ ఉపయోగ పడుతుంది. మా ఆద్యుక్షుడు విష్ణు మంచు, వైస్ ప్రెసెడెంట్ మాదాల రవి, ట్రెజరర్ శివ బాలాజీ మరియు మా కుటుంబ సభ్యులు అందరు కాంటినెంటల్ హాస్పిటల్స్ చైర్మన్ గురునాథ రెడ్డికి,  రఘునాధ రెడ్డి గారికి మరియు హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు.
 
ఈ సందర్బంగా మా ప్రెసిడెంట్ విష్ణు మంచు మాట్లాడుతూ "కాంటినెంటల్ హాస్పిటల్స్ యాజమాన్యానికి గురునాథ రెడ్డి గారికి, రఘునాధ రెడ్డి, మేఘనాధ్ గారికి ధన్యవాదాలు. జనరల్ గా మాస్టర్ హెల్త్ చెకప్ కి పదివేలు అవుతుంది, కానీ కాంటినెంటల్ హాస్పిటల్స్ మాకు ఉచితంగా చేస్తున్నారు. గురునాథ రెడ్డి గారికి, రఘునాధ రెడ్డి, మేఘనాధ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఉత్తమ సేవలు అందిస్తున్నారు. కాంటినెంటల్ హాస్పిటల్స్ మా అసోసియేషన్ సభ్యులందరికి ఇలాంటి సర్వీస్ చేస్తున్నందుకు చాలా సంతోషం" అని తెలియజేసారు.
 
మా వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి మాట్లాడుతూ "ఇవాళ 400 సభ్యులకు మాస్టర్ హెల్త్ చెకప్ చేయటం జరిగింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చేస్తున్న మూడవ హెల్త్ చెకప్ ఇది. మేము  సంప్రదించగానే మా కి మాస్టర్ హెల్త్ చెకప్ మరియు హెల్త్ క్యాంపు నిర్మవహించన చైర్ మాన్ గురునాథ రెడ్డి గారికి, రఘునాథ రెడ్డి గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా సభ్యులందరికి 3 లక్షల విలువ చేసే హెల్త్ భీమాని ఉచితంగా అందిస్తున్నాం" అని తెలిపారు.
 
కాంటినెంటల్ హాస్పిటల్స్ చైర్ మాన్ గురునాథ రెడ్డి మాట్లాడుతూ " మూవీ  ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులకి ఇలాంటి సేవ చేయటం చాలా సంతోషంగా ఉంది. ఆరోగ్యమే మహా భాగ్యం. మనిషికి ఆరోగ్యం సరిగా లేకపోతే వాళ్ళు ఏమి చేయలేరు. అందుకే నేను కాంటినెంటిల్ హాస్పిటల్స్ స్థాపించాను. మా హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ కాదు, ఇంటర్నేషనల్ స్థాయిలో హాస్పిటల్ ఎలా ఉండాలో ప్లాన్ చేసి మరి నిర్మించాము. 600 రూమ్స్ సిద్ధంగా ఉన్నాయి. మా హాస్పిటల్ లో ఆరోగ్య సంరక్షణ నిజాయితీగా జరుగుతుంది. భారత దేశంలోనే  కాంటినెంటల్ హాస్పిటల్స్ సురక్షితమైన హాస్పిటల్ గా బిరుదు పొందింది. హాస్పిటల్ నడిపించడం అంటే ఒక సినిమా తీయటం లాంటిదే. డాక్టర్స్ హీరోస్ గా, నర్సుస్ హీరోయిన్స్ గా అందరం కలిసి పేషెంట్ ని బ్రతికిస్తాం" అని తెలియజేసారు.  
 
మా ట్రెజరర్ శివ బాలాజీ మాట్లాడుతూ "ఇలాంటి సేవ అందిస్తున్నకాంటినెంటల్ హాస్పిటల్స్ యాజమాన్యానికి  ధన్యవాదాలు. మేము మా ఎలక్షన్స్ గెలిచినా తర్వాత విష్ణు గారు హెల్త్ కి మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ రోజు జరిగే హెల్త్ చెకప్ మంచి విజయవంతం అవాలి అని బాగా శ్రమించాం. హాస్పిటల్ లో ఫెసిలిటీస్ బాగున్నాయి. మా సభ్యులంతా సంతోషంగా ఉన్నారు" అని తెలియజేసారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వీలు చిక్కితే చిన్నారులతో సమయాన్ని వెచ్చించండి... హీరోయిన్ శ్రీలీల