Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిన్న సినిమాకు పట్టం కట్టిన జాతీయ సినీ అవార్డులు.. కథకు, ఉద్వేగానికి అందలం

తెలుగు సినిమా పంట పండిది అనేకంటే జాతీయ అవార్డుల ఎంపిక జ్యూరీ మైండ్ సెట్టే పూర్తిగా మారిపోయిందని చెబితే అది వాస్తవానికి న్యాయం చేసినట్లు ఉంటుంది. ఇంతకాలం తర్వాత చిన్న సినిమా అని పిలుస్తున్న కథా ప్రాధాన్యం కలిగిన చిత్రాలకు జాతీయ గౌరవం దక్కిందనే చెప్పాల

చిన్న సినిమాకు పట్టం కట్టిన జాతీయ సినీ అవార్డులు.. కథకు, ఉద్వేగానికి అందలం
హైదరాబాద్ , శనివారం, 8 ఏప్రియల్ 2017 (05:27 IST)
తెలుగు సినిమా పంట పండిది అనేకంటే జాతీయ అవార్డుల ఎంపిక జ్యూరీ మైండ్ సెట్టే పూర్తిగా మారిపోయిందని చెబితే అది వాస్తవానికి న్యాయం చేసినట్లు ఉంటుంది. ఇంతకాలం తర్వాత చిన్న సినిమా అని పిలుస్తున్న కథా ప్రాధాన్యం కలిగిన చిత్రాలకు జాతీయ గౌరవం దక్కిందనే చెప్పాలి. కోట్లు పెట్టి సినిమా తీస్తే అవార్డు వస్తుందా బాక్సాఫీస్‌ దగ్గర రికార్డులు బద్దలు కొడితే అవార్డులు వస్తాయా... చిన్నవాళ్లు నటిస్తే అవార్డులు రావా.. తక్కువ బడ్జెట్‌తో తీసే సినిమాలకు అవార్డులు దక్కవా వంటి ప్రశ్నలకు 64వ జాతీయ అవార్డులు అసలు సిసలైన సమాధానం ఇచ్చాయి. 
 
శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 64వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తొలిసారిగా మూడు తెలుగు చిత్రాలు సత్తా చాటాయి. అందరూ కొత్తవాళ్లతో తీసిన పెళ్లి చూపులు సినిమా తెలుగులో ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రం అవార్డుతోపాటు ఉత్తమ సంభాషణల అవార్డును గెలుచుకుంది. ఇక ప్రేమానురాగాలు, ఆప్యాయతల కలబోతగా తెరకెక్కిన ‘శతమానం భవతి’ ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగాఅవార్డుకు ఎంపికైంది. అలాగే జూనియర్‌ ఎన్టీఆర్‌ ‘జనతా గ్యారేజ్‌’ను ఉత్తమ కొరియోగ్రఫీ (రాజు సుందరం) అవార్డుతోపాటు ప్రత్యేక జూరీ అవార్డు (మోహన్ లాల్‌) వరించాయి. 
 
విలువలున్న సినిమాలకు జ్యూరీ సభ్యులు ప్రాధాన్యం ఇచ్చినట్లు అర్థమవుతోంది. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ‘శతమానం భవతి’, ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘పెళ్లి చూపులు’, ‘జనతా గ్యారేజ్‌’కి గాను మోహన్‌లాల్‌కు ప్రత్యేక జ్యూరీ అవార్డు దక్కడం తెలుగు సినీ పరిశ్రమ ఆనందించదగ్గ విషయం.
 
2016 జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ప్రజాదరణ పొందిన సమగ్ర వినోదాత్మక చిత్రంగా ఎంపికైంది. ‘శంకరాభరణం’, ‘గీతాంజలి’ తర్వాత ఈ విభాగంలో జాతీయ పురస్కారం దక్కించుకున్న తెలుగు చిత్రమిది. కాలంతోపాటు పరిగెడుతూ సొంత వూరునీ, కన్నవాళ్లని మరిచిపోతున్న నేటి తరానికి కనువిప్పు కలిగించేలా దర్శకుడు సతీష్‌ వేగశ్న రూపొందించారు. విదేశాల్లో ఉన్న తమ పిల్లల్ని ఏడాదికోసారైనా చూడాలని తపించే తల్లిదండ్రులు... దాని కోసం ఏం చేశారనే కథతో ఈ చిత్రం సాగుతుంది. 
 
గత సంవత్సరం చిన్న చిత్రంగా ప్రేక్షకుల ముందుకొచ్చి... పెద్ద విజయాన్ని సొంతం చేసుకొన్న చిత్రం ‘పెళ్ళిచూపులు’. 2016కిగాను ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు)గా నిలిచింది. ఒక పక్క ఇష్టం లేని చదువు ,మరో పక్క జీవితంలో ఏదో సాధించాలంటూ కలలు కనే ప్రశాంత్‌ (విజయ్‌ దేవరకొండ) అనే యువకుడు, ప్రతిదాన్నీ వాస్తవిక కోణంలో చూస్తూ తాను అనుకొన్నది ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించే చిత్ర (రీతూ వర్మ) అనే అమ్మాయి ప్రయాణమే ఈ చిత్రం.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒక్క కాల్ చెయ్యండి చాలు.. వచ్చి వాలిపోతా అంటున్న కేరళ కుట్టి