కథానాయకుడు సుధీర్ బాబు తండ్రి వ్యాపార వేత్త. ఫర్టిలైజర్ వ్యాపారాన్ని విజయవాడలో చేసేవాడు. చిన్నతనంలో చాలా అల్లరిగా వుండేవాడు. తల్లిదండ్రులు సహించలేక నువ్వు మాకు పుట్టలేదు. అడవిలో దొరికావు అనేవారట. దాంతో చిన్నతనంలో కొంచెం అర్థం అయి అర్థం అవ్వక కాలం గడిచిపోయింది. ఈ విషయాన్ని తన తండ్రితో కొంచెం పెద్దయ్యాక అడగడం సహజమే. కానీ ఈరోజు ప్రత్యేకంగా ఫోన్ చేసి.. డాడీ.. ఐ లవ్ యూ.. అంటూ సుధీర్ బాబు అడిగాడు. దానికి వారి నాన్న సంతోషంతో అలాగే నాన్న.. అన్నారు.
మరి చిన్నప్పుడు నేను అడవిలో దొరికాను అని ఎందుకు చెప్పావ్ అని సుధీర్ ప్రశ్నించడంతో... ఏం చేస్తావ్.. నువ్వు చెప్పిన మాట వినేవాడికి రాదు. ఇసికించేవాడిని. అప్పుడు ఎవరైనా అలా అంటారు. నేను అలా అన్నానని క్లారిటీ ఇచ్చాడు. దాంతో సుధీర్ బాబు ఫ్యాన్స్ కూడా విజల్స్ వేశారు.
ఈ సంఘటన మా నాన్న సూపర్ హీరో చిత్రం టీజర్ లో జరిగింది. హైదరాబాద్ లో కొద్దిసేపటి క్రితం జరిగిన ఈ వేడుకలో నాన్న, కొడుకుల అనుబంధం గురించి కథ ఇది. నా కెరీర్ లో మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఫిల్మ్. అక్టోబర్ 11న ఫ్యామిలీతో కలసి థియేటర్స్ లో చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు అని హీరో సుధీర్ బాబు అన్నారు.