Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా ఇసైఙ్ఞాని ఇళయరాజా మ్యూజికల్ లైవ్ కన్సర్ట్

Advertiesment
Ilayaraja, TG Bharath

దేవీ

, శనివారం, 13 సెప్టెంబరు 2025 (15:59 IST)
Ilayaraja, TG Bharath
ఇసైఙ్ఞాని ఇళయరాజా సంగీత విభావరి (లైవ్ కన్సర్ట్) పెద్ద ఎత్తున మొదటిసారి ఆంధ్రప్రదేశ్ లో జరగనుంది. విజయవాడ ఎంజి రోడ్ లోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నవంబర్ 8వ తేదీ శనివారం నాడు కనీవినీ ఎరుగని రీతిలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. విజయవాడలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ట్రెండ్ సెట్టర్స్ లైవ్ సుధాకర్ ఈ లైవ్‌ కన్సర్ట్‌ ను నిర్వహిస్తున్నారు.
 
 ఈ సంగీత కచ్చేరికి సంబంధించిన పోస్టర్‌ ను ఇసైఙ్ఞాని ఇళయరాజా తో పాటు, ఏపీ ఇండస్ట్రీస్ మినిస్టర్ టీజీ భరత్ విడుదల చేశారు. ఈవెంట్ కు సంబంధించిన టికెట్లను ఇప్పటికే బుక్ మై షో లో పొందుపరచగా మంచి రెస్పాన్స్ దక్కుతోంది. అత్యంత వేగంగా టికెట్లు అమ్ముడు అవుతున్నాయి. ఇంకా లిమిటెడ్ టికెట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో ఇప్పటివరకు కనీ విని ఎరుగని రీతిలో ఈ సంగీత విభావరి కార్యక్రమం కోసం గట్టి భద్రత, సకల సౌకర్యాలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు.
 
ఈ సందర్భంగా ట్రెండ్ సెట్టర్స్ సుధాకర్ గారు మాట్లాడుతూ.. "సినీ సంగీతానికి జీవనాడిగా ఉన్న ఇళయరాజా గారితో కలిసి ఈ సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఇళయరాజా గారు మొదటిసారి ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్న లైవ్  కన్సర్ట్‌ కావడంతో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో భారీ ఎత్తున సన్నాహాలు చేస్తున్నాం. ఈ ఈవెంట్ కు సంబంధించిన టిక్కెట్లను బుక్ మై షో  యాప్‌ ద్వారా బుక్‌ చేసుకోవచ్చు.
 
80 మంది సభ్యుల బృందంతో ఇళయరాజా గారు ఈ లైవ్ కన్సర్ట్ కు హాజరవుతున్నారు. ఏపీలో ఇలాంటి మ్యూజికల్ కన్సర్ట్ ను ఇంత లార్జ్ స్కేల్ లో నిర్వహించడం ఇదే మొదటిసారి" అని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హర్షవర్ధన్ షాహాజీ షిండే- కొత్తదారులు చూపుతున్న యువ పారిశ్రామికవేత్త