Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అగాతియా నుంచి జీవా, రాశి ఖన్నాలపై ఫస్ట్ సింగిల్ గాలి ఊయలలో.. రిలీజ్

Jiiva, Raashii Khanna

డీవీ

, మంగళవారం, 7 జనవరి 2025 (08:57 IST)
Jiiva, Raashii Khanna
ఫాంటసీ-హారర్-థ్రిల్లర్ విజువల్ మాస్టర్ పీస్ అగాతియా నుంచి ఫస్ట్ సింగిల్ గాలి ఊయలలో రిలీజ్ చేశారు మేకర్స్. ఇది తమిళ సినిమా. తెలుగులో కూడా విడుదలకాబోతుంది. పా. విజయ్ రచన మరియు దర్శకత్వం వహించగా, ఈ చిత్రంలో జీవా, అర్జున్ సర్జా,  రాశి ఖన్నా నటించారు. ఎడ్వర్డ్ సోన్నెన్‌బ్లిక్, యోగి బాబు, VTV గణేష్, రెడిన్ కింగ్స్లీ, రాధా రవి, అళగం పెరుమాల్ మరియు ఇంద్రజ శంకర్ సహాయక పాత్రల్లో నటించారు
 
గాలి ఊయలల్లో మిస్టరీ, ఎమోషన్స్ ఎసెన్స్ ని అందిస్తోంది. ఇళయరాజా సిగ్నేచర్ పియానో పీస్‌తో ప్రారంభమైన ఈ పాట, మరుపురాని అనుభూతిని అందిస్తూ, ఒక సోల్ ఫుల్ మెలోడీగా అలరిస్తోంది. యువన్ శంకర్ రాజా, మెలోడీలలో మాస్టర్, శ్రోతలను లోతుగా ఆకట్టుకునే పాటని రూపొందించారు.  శ్రీధర్ మాస్టర్ కొరియోగ్రఫీ, దీపక్ కుమార్ పాడి అందించిన ఉత్కంఠభరితమైన సినిమాటోగ్రఫీ ఈ పాటను విజువల్ ట్రీట్‌గా నిలిపాయి.
 
దర్శకుడు, పాటల రచయిత పా.విజయ్ మాట్లాడుతూ “ఈ పాట కేవలం మెలోడీ కాదు-ఇది ఒక ప్రయాణం. ఇది ఇళయరాజామ  బీథోవెన్‌ల ప్రతిభను కలిగి ఉండాలని నేను కోరుకున్నాను. నేను ఈ ఐడియాను యువన్‌కి అందించగా, అతను కేవలం 10 నిమిషాల్లో మ్యాజిక్ సృష్టించాడు. ఇది టైమ్‌లెస్ ట్యూన్‌లు, మోడ్రన్ సెన్సిబిలిటీల సమ్మేళనం'అన్నారు.
 
యువన్ శంకర్ రాజా తన అనుభవం గురించి చెబుతూ.. ''పా.విజయ్‌తో కలిసి పనిచేయడం ఎప్పుడూ ప్రత్యేకమే. మేము కలిసి 300 పాటలకు పైగా పని చేసాము. గాలి ఊయలలో మా నాన్నగారి పియానో పీస్ , బీథోవెన్ ట్యూన్‌ను చేర్చడం గురించి అతను చెప్పినప్పుడు, నేను థ్రిల్ అయ్యాను.  ఇది నా అత్యుత్తమ మెలోడీలలో ఒకటి అని నేను నిజంగా నమ్ముతున్నాను.'అన్నారు
 
ఈ పాన్ ఇండియా మూవీ జనవరి 31, 2025న తమిళం, తెలుగు, హిందీలో గ్రాండ్ గా విడుదల కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సినీ జర్నలిజాన్నే గౌరవంగా భావించి ఎదిగిన బి ఏ రాజు- 65వ జయంతి