Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైఎస్సార్ ''యాత్ర'' మొదలుకానుంది.. మమ్ముట్టి పంచెకట్టులో..?

''ఆనందో బ్రహ్మ'' ఫేమ మహి వి. రాఘవ్ వైఎస్సార్ బయోపిక్‌ను బుధవారం నుంచి ప్రారంభించనున్నాడు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్రను రాఘవ్ రూపొందించనున్నాడు. బుధవారం నుంచి రెగ్యులర్ షూటి

Advertiesment
వైఎస్సార్ ''యాత్ర'' మొదలుకానుంది.. మమ్ముట్టి పంచెకట్టులో..?
, మంగళవారం, 19 జూన్ 2018 (16:46 IST)
''ఆనందో బ్రహ్మ'' ఫేమ మహి వి. రాఘవ్ వైఎస్సార్ బయోపిక్‌ను బుధవారం నుంచి ప్రారంభించనున్నాడు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్రను రాఘవ్ రూపొందించనున్నాడు. బుధవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే వైఎస్సార్ పాత్రకు రాఘవ్ మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టిని ఎంపిక చేశారు. సినిమా టైటిల్‌ను యాత్రగా ఖరారు చేశారు. 
 
పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 20వ తేదీ (బుధవారం) నుంచి ఆరంభించనున్నారు. బుధవారం నుంచి సెప్టెంబర్ వరకూ ఏకధాటిగా జరిగే సింగిల్ షెడ్యూల్లో ఈ సినిమా షూటింగు పార్టును ముగించనున్నారు. ముందుగా చేసుకున్న ప్లాన్ ప్రకారం ఆయా సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. 
 
ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి భార్య పాత్రలో 'బాహుబలి' ఫేమ్ ఆశ్రిత వేముగంటి, సబితా ఇంద్రారెడ్డి పాత్రలో సుహాసిని కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక వైఎస్సార్ కుమార్తె షర్మిల పాత్రలో భూమిక నటించనున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
 
అయితే వైకాపా చీఫ్, వైఎస్సార్ తనయుడు జగన్ పాత్రలో ఎవరు నటిస్తారనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. వైయస్ ప్రధాన అనుచరుడు సూరీడు పాత్రలో పోసాని కృష్ణమురళి నటించనున్నట్టు సమాచారం. 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్పీడు పెంచిన సైరా... కార‌ణం ఏంటో తెలుసా..?