Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తలైవిగా కంగనా రనౌత్... ఎంజీఆర్‌గా అరవింద్ స్వామి (video)

Advertiesment
తలైవిగా కంగనా రనౌత్... ఎంజీఆర్‌గా అరవింద్ స్వామి (video)
, గురువారం, 14 నవంబరు 2019 (14:56 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా పలు చిత్రాలు (బయోపిక్‌లు) తెరకెక్కుతున్నాయి. వీటిలో కొన్ని ప్రీప్రొడక్షన్ దశలో ఉండగా, మరికొన్ని షూటింగ్‌లు జరుపుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రధారిగా ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తలైవి పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. 
 
రూ.250 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వైబ్రీ మీడియా, విష్ణు ఇందూరిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తుండగా కంగనా రనౌత్ నాలుగు విభిన్న పాత్రల్లో కనిపించనుంది. 
 
ఈ నాలుగు పాత్రల్లో అతి ముఖ్యమైన పాత్ర స్వర్గీయ ఎంజీఆర్‌ దగ్గరకు చేరదీయడం. జయలలిత జీవితంలో కూడా ఎంజీఆర్ పాత్రకు ప్రత్యేకత ఉంది. ఈ పాత్రలో ప్రస్తుతం కోలీవుడ్ మన్మథుడు అరవింద్  స్వామి కనిపించనున్నారు. 
 
దీనికి సంబంధించిన లుక్‌కు తాజాగా విడుదల చేశారు. షూట్‌లో పాల్గొనే ముందు అర‌వింద్ స్వామి ఫోటోకి ఫోజిచ్చారు. ఆ పిక్ ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. క్లీన్ షేవ్ చేసుకొని పూర్తి గ్లామర్ లుక్‌లో ఉన్న అర‌వింద్ స్వామి ఫోటో అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ రోజు రాత్రిని ఉదయనిధి స్టాలిన్ మరిచిపోరనుకుంటా: శ్రీరెడ్డి