ఫుడ్ డిస్ట్రిబ్యూటర్‌గా మారిన ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ 'గౌరీ శంకర్'

సోమవారం, 25 మే 2020 (19:19 IST)
ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, విడుదలకు సిద్ధమవుతున్న 'నిరీక్షణ' చిత్ర దర్శకులు మళ్ళ వంశీకృష్ణ, 'రోషగాడు' నిర్మాతలు మోహన్ రావు-పార్వతి, 'హిజా' హీరో కమ్ డైరెక్టర్ మున్నాకాశి, తూర్పు గోదావరి-రాజోలు ఫోర్ షోస్ సినీప్లెక్స్ అధినేత పాలిక శ్రీను తదితర సినీ ప్రముఖులతోపాటు.. పలు రంగాలకు చెందిన వదాన్యుల సహాయ సహకారాలతో.. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గౌరీ శంకర్ కరోనా కష్ట కాలంలో.. అనకాపల్లిలో గత కొన్ని రోజులుగా 'అన్నదాన కార్యక్రమం' నిర్వహిస్తున్నారు.
 
భారత్ వికాస్ పరిషత్ సౌజన్యంతో.. గౌరీ శంకర్ నిర్వహిస్తున్న ఈ సేవా క్రతువుకు విశ్రాంత పోలీస్ అధికారి పీలా గోపాల్ రావు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయి అవార్డు గ్రహీత శ్రీమతి పిల్లా నిర్మల వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఉడతాభక్తిగా.. కరోనా విపత్కాలంలో తాను చేస్తున్న అన్నదాన కార్యక్రమానికి.. వివిధ రంగాలకు చెందిన అమృత హృదయులతోపాటు.. సినిమా రంగానికి చెందిన పలువురు మానవతావాదులు ఎంతో పెద్ద మనసుతో చేయూతనందిస్తుండటం తనను ముందుకు నడిపిస్తోందని వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ గా పరిశ్రమ వర్గాలకు సుపరిచితులైన గౌరీ శంకర్ పేర్కొన్నారు.
 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం డేటింగ్ వార్తను చూసి మేమిద్దరం నవ్వుకునేవాళ్లం : సోనాక్షి సిన్హా