Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అందంగా కనిపించడానికి ప్రతి వారు మేకప్‌ పొరలను వేసుకోవాల్సిందేనా: సాయిపల్లవి

అందంగా కనిపించడానికి ప్రతి వారు మేకప్‌ పొరలను వేసుకోవాల్సిన అవసరం లేదని ఫిదా సాయిపల్లవి తేల్చి చెప్పారు. ‘నేను సహజసిద్ధంగా కనిపించడానికే ఎప్పుడూ ప్రయత్నిస్తాను. అందమంటే అంతటా ఒకే నిర్వచనం ఉండదు. అందంగా కనిపించడానికి ప్రతి వారు మేకప్‌ పొరలను వేసుకోవాల

Advertiesment
అందంగా కనిపించడానికి ప్రతి వారు మేకప్‌ పొరలను వేసుకోవాల్సిందేనా: సాయిపల్లవి
హైదరాబాద్ , బుధవారం, 2 ఆగస్టు 2017 (01:43 IST)
అందంగా కనిపించడానికి ప్రతి వారు మేకప్‌ పొరలను వేసుకోవాల్సిన అవసరం లేదని ఫిదా సాయిపల్లవి తేల్చి చెప్పారు. ‘నేను సహజసిద్ధంగా కనిపించడానికే ఎప్పుడూ ప్రయత్నిస్తాను. అందమంటే అంతటా ఒకే నిర్వచనం ఉండదు. అందంగా కనిపించడానికి ప్రతి వారు మేకప్‌ పొరలను వేసుకోవాల్సిన అవసరం లేదని నేను భావిస్తాను. అందానికి ఆత్మవిశ్వాసం ముఖ్యం. నా చర్మ సౌందర్యం పట్ల నాకు ఆత్మ విశ్వాసం ఉంది. అందరు నన్ను అందంగా ఉంటారని అంటారు. అందుకనే అందానికి మేకప్‌ పొరలు అంకర్లేదనుకుంటాను’ అని ఫిదా సినిమా హిట్‌ చిత్రం నేపథ్యంలో మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తెలిపారు.
 
‘దుస్తుల విషయంలో కూడా నేను సహజంగానే ఉంటాను. నాకు అలవాటైన దుస్తుల్నే సినిమాలో వేసుకుంటానని శేఖర్‌ కమ్ముల గారికి చెప్పాను. అందుకు ఆయన అంగీకరించారు. నేను నేనుగా కనిపించడమే నాకు ఇష్టం. అందుకనే ఇంతకుముందు మలయాళంలో వచ్చిన ‘ప్రేమమ్, కాళి’ సినిమాలు హిట్టయ్యాయని అనుకుంటాను అంటూ సౌందర్యంపట్ల తన నిర్వచనాన్ని కొత్తగా చెప్పారు సాయిపల్లవి
 
పెద్దగా మలయాళంరాని నాకు కాళి చిత్రంలో సొంత డబ్బింగ్‌ పనికి రాదనుకున్నాను. కానీ వర్కవుట్‌ అయింది. ఆ చిత్రంతో నా గొంతులో కొంత మార్పు వచ్చింది. కోపంతో పెద్ద పెద్దగా మాట్లాడడం అలవాటయింది. అందుకని తెలుగులో ఎవరినైనా డబ్బింగ్‌కు ఏర్పాటు చేయమని చెప్పాను. అయితే ఒక్కసారి ఇతరులను డబ్బింగ్‌ పెట్టుకుంటే తర్వాత తెలుగు సినిమాల్లో నటించినప్పుడు కూడా డబ్బింగ్‌ పెట్టుకోవాల్సి ఉంటుందని శేఖర్‌ కమ్ముల హెచ్చరించారు. ఆయన సూచన మేరకు నేను డబ్బింగ్‌ చెప్పాను’ అని పల్లవి పేర్కొన్నారు.
 
‘ఫిదా’ చిత్రం ద్వారా తెలుగు తెరకు తొలిసారి పరిచయం అయిన తమిళ నటి సాయి పల్లవి సహజ అందాన్ని చూసి ఇటు తెలుగు, తమిళ, మలయాళ ప్రేక్షకులు నిజంగా ఫిదా అవుతున్నారు. 2015లో వచ్చిన ‘ప్రేమమ్‌’ అనే మలయాళ చిత్రం ద్వారా తొలిసారిగా సినీరంగ ప్రవేశం చేసిన పల్లవి అదే మలయాళంలో 2016లో విడుదలైన కాళి చిత్రంలో నటించి ఎంతో పేరు తిచ్చుకున్నారు. మూడవ చిత్రం ‘ఫిదా’ ద్వారా ఆమె తెలుగు తెరకు తొలిసారిగా పరిచయం అయ్యారు. సహజ సౌందర్యానికి ప్రాధాన్యతనిచ్చే పల్లవి తెలుగు చిత్రంలో కూడా పౌడరు తప్ప మేకప్‌ లేకుండా కనిపించి ప్రేక్షకులను మెప్పించారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓహో అందుకేనా ఈ సినిమాలన్నీ "బ్యాంకాక్" చుట్టూ నడిచింది?