Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహేష్‌ను కలవరపెడుతున్న ఆ "స్పైడర్" ఎవరు?

సూపర్‌స్టార్ మహేష్ బాబు గత కొంతకాలంగా టాలీవుడ్ నెం.1 స్థానానికి గట్టి పోటీని ఇస్తున్నారు. అది కాస్త యువ హీరోల రాకతో ఇంకా రసవత్తరంగా మారింది. మహేష్ గత సినిమా "బ్రహ్మోత్సవం" ఆశించిన మేరకు ఆడలేదు. దీంతో అతని అభిమానులు మురుగదాస్‌తో తదుపరి చేస్తున్న ద్విభ

Advertiesment
Mahesh babu
, బుధవారం, 14 జూన్ 2017 (19:16 IST)
సూపర్‌స్టార్ మహేష్ బాబు గత కొంతకాలంగా టాలీవుడ్ నెం.1 స్థానానికి గట్టి పోటీని ఇస్తున్నారు. అది కాస్త యువ హీరోల రాకతో ఇంకా రసవత్తరంగా మారింది. మహేష్ గత సినిమా "బ్రహ్మోత్సవం" ఆశించిన మేరకు ఆడలేదు. దీంతో అతని అభిమానులు మురుగదాస్‌తో తదుపరి చేస్తున్న ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం అయిన "స్పైడర్"పై ఆశలు పెట్టుకున్నారు. వారి అంచనాలకు తగ్గట్టు ఈ సినిమా టీజర్ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. 
 
చిత్రం దసరా కానుకగా రిలీజ్ కానుంది. ఇంతకీ విషయమేంటంటే ఈ సినిమాకు సంబంధించిన ఒక విషయం అందరినీ కలవరపెడుతుంది. అదే మ్యూజిక్. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌ అయిన "హరీష్ జయరాజ్" గత సినిమాల ట్రాక్ రికార్డే  ఇప్పుడు అతడిని స్పైడర్‌గా మారుస్తుంది. ఇతగాడు ఇప్పటివరకు తెలుగులో వాసు, ఘర్షణ, సైనికుడు, మున్నా, సెల్యూట్, ఆరెంజ్ సినిమాలకు సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాలలో సంగీతం ఫర్వాలేదనిపించినా సినిమా ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవు. 
 
అదే తమిళ అనువాద చిత్రాలైన చెలి, అపరిచితుడు, గజినీ, రాఘవన్, సూర్య s/o. కృష్ణన్, వీడొక్కడే, ఘటికుడు, రంగం, సెవెన్త్ సెన్స్, స్నేహితుడు, ఇంకొక్కడు మొదలైనవి తెలుగులో సూపర్ హిట్‌లుగా నిలిచాయి. ఇప్పుడు ఈ సెంటిమెంట్  అభిమానులందరినీ కలవరపెడుతున్నది. మరి ఈ సెంటిమెంటును మహేష్ బాబు స్పైడర్ బ్రేక్ చేస్తుందేమో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూనియర్ ఎన్టీఆర్ ఒక్కసారి చేస్తే రూ. 50 లక్షలు... టాలీవుడ్ షేక్...