Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హీరోలూ మగాళ్లే.. మనకంటే ఘోరంగా అమ్మాయిల కోసం కొట్టుకుచస్తారు.. లైట్ తీసుకోండి

సినిమాల్లో హీరోలు చూపించే హీరోయిజం, ప్రదర్శించే ఉదాత్త భావాలు, ఆచరించే నీతులూ ఎంత ఘనంగా ఉంటాయంటే అవన్నీ నిజమే కామోసు అని పిచ్చి జనం అనుకునేటంత ఘనంగా ఉంటాయి. కానీ నిత్యజీవితంలో వీళ్ళ యవ్వారం, వీళ్ల కొట్లాటలు, ఈర్ష్యలు, వీళ్లలో ఉండే పచ్చి భూస్వామ్య మన

Advertiesment
Aditya Roy Kapur
హైదరాబాద్ , గురువారం, 6 ఏప్రియల్ 2017 (05:06 IST)
సినిమాల్లో హీరోలు చూపించే హీరోయిజం, ప్రదర్శించే ఉదాత్త భావాలు, ఆచరించే నీతులూ ఎంత ఘనంగా ఉంటాయంటే అవన్నీ నిజమే కామోసు అని పిచ్చి జనం అనుకునేటంత ఘనంగా ఉంటాయి. కానీ నిత్యజీవితంలో వీళ్ళ యవ్వారం,  వీళ్ల కొట్లాటలు, ఈర్ష్యలు, వీళ్లలో ఉండే పచ్చి భూస్వామ్య మనస్తత్వం చూస్తే వీళ్లా మనం ప్రేమించే, ఆరాధించే హీరోలు. వీళ్లకోసమా అభిమానులు ఇంతగా కొట్టుకు చచ్చేది అంటూ విచారమేస్తుంది. కానీ మరోవైపున వీళ్లూ మనలాంటి మామూలు మనుషులే, సాధారణ జనంలో ఉండే సమస్త కుమ్ములాటలూ వీళ్లలోనూ ఉంటాయన్న నగ్న సత్యం తెలిశాక వాళ్లూ మనమూ ఒకే స్థాయిలో ఉన్నాంలే అని మన ఈగోను కాస్త సంతృప్తి పర్చుకుని ఆపై ఎవరి పనిలో వారుండవచ్చు కదా..
 
బాలీవుడ్‌ నటులు  ఆదిత్య రాయ్‌ కపూర్‌, ఫర్హాన్‌ అఖ్తర్‌ గొడవకు దిగడం.. అదికూడా నటి శ్రద్ధా కపూర్‌ కోసం తగాదా పడటం ఒక రేంజిలో సంచలనం కలిగించింది. విషయానికి వస్తే.. ఇటీవల మహేశ్‌ భట్‌ కుటుంబం తాము పరిశ్రమకు వచ్చి 30 ఏళ్లు అయిన సందర్భంగా వేడుకలు నిర్వహించింది. ఈ వేడుకలకు మిగతా స్టార్స్‌ లాగే 'ఆషికీ-2' స్టార్స్‌ ఆదిత్య, శ్రద్ధ జంటగా హాజరయ్యారు. 'ఆషికీ-2' సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ నడిచిందని, కొంతకాలం వీరు డేటింగ్‌ చేశారని అప్పట్లో కథనాలు వచ్చాయి. అయితే ఇలా ఎక్స్‌ లవర్స్‌ కలిసి వచ్చి పార్టీలో హల్‌చల్‌ చేయడం ఫర్హాన్‌ అఖ్తర్‌కు అస్సలు నచ్చలేదట. 
 
ఎందుకంటే 'రాక్‌ ఆన్‌ 2'లో తనతో కలిసి నటించిన శ్రద్ధతో ఫర్హాన్‌ ప్రస్తుతం డేటింగ్‌ చేస్తున్నాడని గత కొన్నాళ్లుగా కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే, వీరిద్దరు కూడా ఇప్పటివరకు ఈ కథనాలను ఖండించడంగానీ, అంగీకరించడంగానీ చేయలేదు. ఈ నేపథ్యంలో శ్రద్ధ, ఆదిత్యతో కలిసి ఈ పార్టీకి రావడం, సన్నిహితంగా మెలగడం ఫర్హాన్‌‌కు కోపం తెప్పించిందని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆదిత్యతో మాటల యుద్ధానికి ఫర్హాన్‌ దిగాడని, ఇద్దరి మధ్య బాహాబాహీ దిగే పరిస్థితి రావడంతో శ్రద్ధ జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిందని తెలిసింది. 
 
అయితే  ఆ గొడవ ముగిసిన తర్వాత మంగళవారం రాత్రి ఫర్హాన్‌ ఇంటి వద్ద శ్రద్ధ కనిపించింది. గొడవ నేపథ్యంలో ఫర్హాన్‌కు నచ్చజెప్పేందుకు, ఇద్దరి నటుల మధ్య రాజీ కుదిర్చేందుకే మంగళవారం రాత్రి ఫర్హాన్‌ ఇంటికి శ్రద్ధ వచ్చిందని ఆ వర్గాలు చెప్పాయి. ఈ సందర్భంగా ఫర్హాన్ ఖాన్ ఇంటికి శ్రద్ధా దాస్ వెళుతున్న దృశ్యాలు ఆన్‌లైన్‌లో హల్ చల్ సృష్టిస్తున్నాయి.
 
ఒక రాధ ఇద్దరు కృష్ణులు అంటే ఇదేనేమో మరి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జ్యోతిష్యుడదే చెప్పాడు