బాలయ్య అబిమాని ఔదార్యం వెల లక్ష రూపాయలు
ఆ వీరాభిమాని అభిమానం వెల లక్షరూపాయలు. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా చూడటానికి బాలయ్య అభిమాని టికెట్టుకు చెల్లించిన ధర అక్షరాలా లక్ష రూపాయలు. ఆ అభిమానం వెర్రి కాదని, ఒక మంచి లక్ష్యం కోసం అంత డబ్బు చెల్లించానని అతడు చెబుతున్నప్పుడు ప్రేక్షకులు మూగవోయారు,
ఆ వీరాభిమాని అభిమానం వెల లక్షరూపాయలు. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా చూడటానికి బాలయ్య అభిమాని టికెట్టుకు చెల్లించిన ధర అక్షరాలా లక్ష రూపాయలు. ఆ అభిమానం వెర్రి కాదని, ఒక మంచి లక్ష్యం కోసం అంత డబ్బు చెల్లించానని అతడు చెబుతున్నప్పుడు ప్రేక్షకులు మూగవోయారు, స్వయంగా బాలకృష్ణ సైతం కదిలిపోయారు. కేన్సర్ రోగులకు మేలు చేకూర్చడానికి నిర్వహించిన బెనిఫట్ షోలో గౌతమీపుత్రశాతకర్ణి సినిమా కోసం ఆ అభిమాని చెల్లించిన ధర చరిత్ర సృష్టించింది.
గుంటూరు జిల్లా నరసరావు పేటలో ఒక రెస్టారెంటును నడుపుతున్న 27 ఏళ్ల గోపీచంద్ ఇనమూరి హైదరాబాద్ నగరంలోని ఒక థియేటర్లో కేన్సర్ రోగుల సహాయార్థం నిర్వహిస్తున్న బెనిపిట్ షోకు వెళ్లాడు. నిర్వాహకులు ఆ బెనిఫిట్ షోకు అమ్మాలనుకున్న టికెట్ ధర 500 నుంచి 1000 రూపాయలు. కానీ గోపీచంద్ టికెట్ కోసం లక్షరూపాయల చెక్కు ఇచ్చినప్పుడు షో నిర్వాహకులకు నోట మాట రాలేదు. హైదరాబాద్‌లో ఉన్న బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో కేన్సర్ రోగులకు తన వంతు సాయపడాలనే ఉద్దేశంతోనే తాను అంత ధర పెట్టి టికెట్ తీసుకున్నట్లు చెప్పాడు.
సంవత్సర కాలంగా తాను డబ్బు పొదుపు చేస్తున్నానని, బాలకృష్ణ సినిమా ద్వారా ఒక మంచిపనికోసం దాన్ని వెచ్చించాలనుకున్నానని గోపీచంద్ చెప్పారు. పార్టీలు వంటి వాటికి అనవసరంగా ఖర్చుపెట్టడానికి కాకుండా ఏదైనా ధర్మకార్యంకోసం ఆ డబ్బును ఆదా చేశానని, గౌతమీపుత్ర శాతకర్ణ సినిమా విడుదల కోసం వేచి చూసి ఇప్పుడిలా విరాళమిస్తున్నానని గోపీచంద్ చెప్పారు. తన అభిమాన హీరో బాలకృష్ణ కూడా తన చర్యను అభినందించారని మరొక సమయంలో ఆయనతో ఫోటో దిగాలని ఉందని చెప్పారు.
తొలిరోజు సినిమా చూడకపోతే గొంతు కోసుకోవడానికి కూడా సిద్దమైపోయిన ఉన్మాద చేష్ట్యలు రాజ్యమేలుతున్న పాడు కాలంలో రోగుల కోసం సంవత్సరం పాటు డబ్బు కూడబెట్టి దాన్ని దుబారా చేయకుండా సమయం వచ్చినప్పుడు దాన్ని విరాళంగా ఇవ్వగలవారు కూడా లోకంలో ఉన్నారనడానికి గోపీచంద్ నిలువెత్తు నిదర్శనం.